Take a fresh look at your lifestyle.

పట్టాలకెక్కిన అత్యాధునిక తేజస్‌ ‌రైలు

Minister Piyush Goyal waving the flag To Tejas train
అహ్మదాబాద్‌లో జెండా ఊపిన మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ – అత్యాధునిక వసతులతో 200 కి. స్పీడుతో వెళ్లనున్న తేజస్‌

అహ్మదాబాద్‌,‌జనవరి17: గరిష్ఠంగా గంటకు 200 కిలోటర్ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్‌ ‌రైలు తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ప్రారంభమైంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్‌గోయల్‌ ‌రైలును అహ్మదాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్ర మంలో గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి విజయ్‌ ‌రూపాని, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీయుష్‌ ‌గోయల్‌ ‌మాట్లాడుతూ… రైలు నడిచే టైంటేబుల్‌ను ప్రకటించామని, జనవరి 19వ తేదీ నుంచి రెగ్యులర్‌గా వారానికి 6 రోజలు రైలు నడుస్తుందని తెలిపారు. పూర్తి ఏసీతో కూడిన ఈ రైలు 736 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, ఐఆర్‌సీటీసీ రైల్‌ ‌కనెక్ట్ ‌ముబైల్‌ ‌యాప్‌లో టికెట్‌ ‌రిజర్వేషన్‌ ‌తీసుకోవచ్చన్నారు. తత్కాల్‌ ‌కోటా, ప్రీమియం తత్కాల్‌ ‌కోటా ఇందులో లేవు. జనరల్‌ ‌కోటా, విదేశీ టూరిస్ట్ ‌కోటా మాత్రమే ఉన్నాయి. ప్రయాణికులందరికీ ఐఆర్‌సీటీసీ ద్వారా రూ.25 లక్షల ఉచిత భీమా కల్పిస్తున్నాం. రైలు ఆలస్యం అయితే గంట ఆలస్యానికి రూ.100, రెండు గంటల ఆలస్యానికి రూ.250లను ఐఆర్‌సీటీసీ పరిహారంగా చెల్లిస్తుంది. ప్రతీ ప్రయాణికుడికి ప్యాకేజ్డ్ ‌డ్రింకింగ్‌ ‌వాటర్‌ ‌బాటిల్‌ ‌కు అదనంగా ప్రతి కోచ్‌లో ఆర్‌వో వాటర్‌ ‌ఫిల్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. రైలులో ప్రయాణించాలనుకునే వారు 60 రోజుల ముందు నుంచి రిజర్వేషన్‌ ‌చేసుకోవచ్చని వెల్లడించారు. రైలు అహ్మదాబాద్‌ ‌నుంచి ఉదయం 6:40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13:10 గంటలకు ముంబై సెంట్రల్‌ ‌రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. తిరిగి ముంబై సెంట్రల్‌ ‌నుంచి 15:40 గంటలకు బయలుదేరి 21:55 గంటలకు అహ్మదాబాద్‌ ‌చేరుకుంటుంది. నదియాడ్‌, ‌వడోదర, భారుచ్‌, ‌సూరత్‌, ‌వాపీ, బొరివలి స్టేషన్‌లలో రైలు ఆగుతుంది.

తేజస్‌ ‌రైలు ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో వచ్చిన అన్ని ట్రెయిన్‌ల కన్నా విలాసవంతమైంది. ఇందులో ఆటోమేటిక్‌ ‌డోర్స్, ఎల్‌సీడీ తెరలు, టీ, కాఫీ మెషిన్లు, మ్యాగజైన్స్, ‌బయో టాయిలెట్స్, ‌హ్యాండ్‌ ‌డ్రయర్స్ ‌వంటి ఆధునిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. ఈ రైలు గంటకు గరిష్టంగా 200 కిలోటర్ల వేగంతో ప్రయాణించగలదు. ముంబై నుంచి గోవా వరకు మొత్తం 579 కిలోటర్ల దూరాన్ని ఈ ట్రెయిన్‌ ‌కవర్‌ ‌చేస్తుంది. అందుకు గాను ఈ రైలుకు దాదాపుగా 8 గంటల సమయం పడుతుంది. త్వరలో ఢిల్లీ-చండీగడ్‌, ‌ఢిల్లీ-లక్నో మార్గాల్లో కూడా ఇలాంటి రైళ్లను నడపను న్నారు. తేజస్‌ ‌రైలులో ముంబై నుంచి గోవా వరకు రూ.2,525 చార్జి అవుతుంది. ఆహారం కావాలనుకుం టే రూ.2,680 వరకు ఒకరికి చార్జి అవుతుంది. ఎగ్జిక్యూటివ్‌ ‌క్లాస్‌కు ఈ చార్జి ఉంటుంది. అదే చెయిర్‌ ‌కార్‌లో వెళితే రూ.1,155 వరకు ఒకరికి చార్జి చేస్తారు. ఫుడ్‌ ‌కావాలనుకుంటే వీరు రూ.1,280 చెల్లించాల్సి ఉంటుంది. తేజస్‌ ‌రైలు కోచ్‌లను కపుర్తలాలోని రైల్‌ ‌కోచ్‌ ‌ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ కోచ్‌లు పూర్తిగా గ్రాఫిటీ ప్రూఫ్‌, ‌డస్ట్ ‌ప్రూఫ్‌ ‌టెక్నాలజీలతో తయారు చేయబడ్డాయి. అంటే ఈ రైలు పెట్టెలపై ఎవరు దేంతో రాసినా గీతలు పడవు. అదేవిధంగా దుమ్ము, ధూళి కూడా పెద్దగా అంటుకోదు. తేజస్‌ ‌రైలులో సీట్లను అత్యంత అధునాతన డిజైన్‌తో తయారు చేశారు. వాటిలో కూర్చుంటే రైలు ఎంత వేగంతో వెళ్తున్నా కుదుపులు ఉండవు. దీంతో ప్రయాణంలో ఎక్కువ అలసట ఉండదు. తేజస్‌ ‌రైలును సీజన్‌లో వారానికి 5 రోజులు నడపనున్నారు. అన్‌సీజన్‌లో వారానికి 3 రోజులే నడుస్తుంది. ఎగ్జిక్యూటివ్‌ ‌క్లాస్‌ ఉన్న 20 కోచ్‌లు ఈ ట్రెయిన్‌లో ఉన్నాయి.

చెయిర్‌ ‌కార్‌ ఉన్న కోచ్‌లు 12 ఉన్నాయి. మొత్తం 32 బోగీలను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్‌ ‌క్లాస్‌లో ఒక్కో బోగీకి 56 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. అదే చెయిర్‌ ‌కార్‌లో అయితే 78 మంది వరకు ప్రయాణించవచ్చు. తేజస్‌ ‌రైలును దాదాపుగా అన్ని రకాల భద్రతా ప్రమాణాలు కలిగి ఉండేలా తయారు చేశారు. ఇందులో అగ్ని ప్రమాదాలను పసిగట్టే స్మోక్‌ ‌డిటెక్షన్‌,గ్•ర్‌ ‌డిటెక్షన్‌ ‌టెక్నాలజీలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రైలులో ప్రయాణికుల సీట్ల వెనుక ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ తెరలపై జీపీఎస్‌ ఆధారిత ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ ‌డిస్‌ప్లేను ప్రదర్శించనున్నారు. దీంతో రైలు ఎక్కడుందో ప్రయాణికులకు సులభంగా తెలుస్తుంది. దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపిలో కూడా ఇందులో సమాచారాన్ని ఏర్పాటు చేశారు. తేజస్‌ ‌ట్రైయిన్‌లో ప్రయాణించేందుకు ప్రయాణికులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. టిక్కెట్లను ఆన్‌లైన్‌లో పెట్టిన కొద్ది సేపట్లోనే చాలా మంది వాటిని కొనుగోలు చేసినట్టు అధికారులు తెలియజేశారు.

Tags: Minister Piyush Goyal, waving the flag, Tejas train, High Speed ​​Rail, Tejas Express

Leave a Reply