Take a fresh look at your lifestyle.

మందిలోకి.. బందీ!!

కోబ్రా బందీని వదిలిండ్లు
మళ్ళీ జన్మంటూ ఇచ్చిండ్లు
పరిమళించిన మానవత్వం
మావోయిస్టులది అదేనంటారా తత్వం
కల్లముందర కనిపిస్తున్న సత్యం
దేశమంతా చూస్తున్నది ఈ నిత్యం

భీకర యుద్ధభూమిలో చిక్కిండు
తన నిండుపాణం దక్కిచ్చుకుండు
నక్సలైట్ల చెరలో  బందీగా మిగిలిండు
ప్రజాకోర్టులో స్వేచ్ఛాపావురమైండు

ఆక్కడెక్కడో బస్తర్‌ అడవుల్లో అన్నలు
అక్కడికేల పోవలే సర్కారు గన్నులు
గీ మాట పౌరసమాజం వినిపిస్తోంది
గది పాలకపక్షం చెవినపెడుతుందా!?
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్ 

Leave a Reply