Take a fresh look at your lifestyle.

ఎఎస్పై కుటుంబానికి 50లక్షలు సిఎం జగన్‌కు డిజిపి కృతజ్ఞతలు

‌లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తిస్తూ కరోనాతో మృతి చెందిన పరిగి ఏఎస్‌ఐ ‌కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ ‌గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డికి ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ‌కృతజ్ఞతలు తెలిపారు. శనివారం విజయవాడలో నిర్వహించిన డియా సమావేశంలో గౌతమ్‌ ‌సవాంగ్‌ ‌మాట్లాడుతూ… బాధిత కుటుంబానికి చెక్‌ అం‌దజేసినట్లు చెప్పారు. దేశంలోనే యాభై లక్షల పరిహారం ప్రకటించిన ఘనత జగన్‌ ‌ప్రభుత్వానిదే అని గౌతమ్‌సవాంగ్‌ ‌కొనియాడారు. దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతపురం జిల్లాలో లాక్‌డౌన్‌ ‌పరిస్థితులను డీజీపీ గౌతం సవాంగ్‌ ‌సక్షించారు. జిల్లాలో పర్యటించి కరోనా నియంత్రణ చర్యలను ఆయన తనిఖీ చేశారు.

రెడ్‌జోన్‌ ‌ప్రాంతాల్లో కఠినంగా వ్యవహరించాలని పోలీసులను డీజీపీ ఆదేశించారు. ’కరోనా వైరస్‌పై సోషల్‌‌డియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విదేశాల నుంచి ఏపీకి 28వేల మంది వచ్చారు. అన్ని శాఖలతో పోలీసులు సమన్వయం చేసుకుంటున్నారు. పోలీసులకు పీపీఈ కిట్ల కొనుగోలుకు రూ.2.89కోట్లు కేటాయించారు. కరోనాతో మృతి చెందిన ఏఎస్‌ఐ ‌కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. కరోనా నివారణకు పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని’ గౌతం సవాంగ్‌ ‌ప్రశంసించారు.

Leave a Reply