Take a fresh look at your lifestyle.

120 ‌మునిసిపాలిటీల్లో 2647 వార్డులో ఎన్నికలు కార్పొరేషన్‌లలో 322 డివిజన్లలో ..

Municipal Campaign to end Tomorrow

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ : ‌రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సమాచారం ప్రకారం బుధవారం 120 మునిసిపాలిటీల్లో 2647 వార్డులో ఎన్నికలు జరుగనున్నాయి. అదేవిధంగా 9 కార్పొరేషన్‌ల్లో 322 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా మునిసిపాలిటీల ఎన్నికల్లో 11,130 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.6188 పోలింగ్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేశారు.40లక్షల 40వేల 582 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగిం చుకోనున్నారు. మునిసిపాలిటీల్లో ఇప్పటివరకు 80 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కార్పొరేషన్‌లలో మూడు ఏకగ్రీవమయ్యాయి. కార్పొరేషన్‌లలో 2112మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కార్పొరేషన్‌లలో 1773 పోలింగ్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటర్లు మొత్తం 13,15,360 మంది ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.వీరిలో 6,66,990 మంది పురుషులు, 6,48,232 మంది స్త్రీలు ఉన్నారు.మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లో కలిపి 52,757 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు.ఇప్పటివరకు  రూ.44లక్షల 49వేల రూపాయలను సీజ్‌చేశారు .25 వేల పోలీసులతోబందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply