Take a fresh look at your lifestyle.

నవజోష్… చంద్రబోస్

దూకుడే తన మంత్రం

ప్రత్యక్ష యుద్ధమే తంత్రం

పౌరుషమే తన ఇజం

సాహసమే తన నైజం

అతడే

నవయుగ జోష్

భారత మిలిటరీ బాస్

నేతాజీ సుభాష్ చంద్రబోస్

అగ్ని క్షిపణిలా జ్వలిస్తూ…

బ్రిటిష్ కోటలు పేల్చినవాడు

కొధమ సింహంలా గర్జిస్తూ…

శత్రు గుండెల చీల్చినవాడు

కరవాలంలా మెరుస్తూ

ఆంగ్ల తలలు తెగ్గోసినవాడు

జైహింద్ నినాదంతో…

పోరు సెగ రగిల్చినవాడు

ఆజాద్ హింద్ పౌజ్ తో

తెల్లదొరల వణికించినవాడు

మత్తులో జోగుతున్న జాతికి

నవజవసత్వాలు అద్దినవాడు

బానిస విముక్తి కోసం

దేశ స్వాతంత్య్రం కోసం

ఆవిశ్రాంత పోరు చేసినవాడు

తన జీవితం దారబోసినవాడు

ఆ మహనీయకు మరణం లేదు

ఆ అస్తిత్వం నిష్క్రమణం కాదు

జాతి ప్రభాత

దేశ కీర్తి పతాక

నేతాజీ సుభాష్ చంద్రునికి

గళమెత్తి జేజేలు పలుకుదాం

శిరస్సు వంచి ప్రణతి అర్పిద్దాం

            “”””””””””

(23 జనవరిన సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా…)

              కోడిగూటి తిరుపతి

          Mbl no ;9573929493

Leave a Reply