Take a fresh look at your lifestyle.

గుమ్మడిదల గ్రామాలు అభివృద్ధికి ప్రతీకలు..

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 3: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తూ, పల్లెలను ప్రగతికి ప్రతికలుగా తీర్చిదిద్దుతున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గుమ్మడిదల మండల పరిధిలోని 13 గ్రామపంచాయతీలలో 12 కోట్ల 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, తదితర అభివృద్ధి పనులకు మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని జోడు గుర్రాల వలె పరిగెత్తిస్తున్నామని తెలిపారు.ప్రతి ఇంట్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో గ్రామ సభల ద్వారా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణలోని ప్రతి పల్లె అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవని అన్నారు. నేడు పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతినెల గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసి కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పాలకవర్గం సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply