Take a fresh look at your lifestyle.

పరీక్షల ఒత్తిడిని దూరం చేసుకోండిలా…!

పరీక్షల కాలంలో కొందరు విద్యార్థులు  ఒత్తిడికి గురవుతుంటారు. పరీక్ష అనగానే విద్యార్థుల ఆలోచనలు గుర్రాల వలే పరుగులు తీస్తుంటాయి. మంచి మార్కులు సాధించగలనా… తల్లిదండ్రులు నాపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చుగలుగుతానా… సరైనా సమాధానాలు రాయగలుగుతానా… ఆశించిన మార్కులు రాకపోతే పరిస్తితి ఏమిటి… బంధువులు, స్నేహితుల, ఉపాధ్యాయుల వద్ద పాఠశాలలో తోటి వారి వద్ద పరిస్తితి ఎలా ఉండబోతోంది… ఇలాంటి ఆందోళన వారి మెదళ్లలో మెదులుతుంటుంది. ఇలాంటి ఒత్తిడి, ఆందోళనలు ప్రక్కన పెట్టి పరీక్ష రాయండి విజయం మీ కాళ్ల దగ్గరకు వచ్చి నిలుచుంటుంది.

మీకు మీరే బాస్‌ : మీ ఆలోచనా విధానం, మీ నిర్ణయాలు, పరీక్షలో ఏం చేయాలి అనే దృఢ నిశ్చయంతో పరీక్షకు సన్నద్దం కండి. పరీక్షలో మీరు తీసుకొనే నిర్ణయానికి మీరే బాస్‌ అనే పాజిటివ్‌ దృక్పథంతో ముందుకు వెల్లాలి.ప్రణాళిక : పరీక్ష సమయానికంటే ముందుగానే పరీక్షా కేంద్రం చేరేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. పరీక్షకు కావల్సిన హాల్‌ టికేట్‌ , పెన్సిలు, రబ్బరు, పెన్ను, పరీక్షా ప్యాడ్‌ ముందుగా సిద్దం చేసుకొవాలి.పరీక్షకు వెల్లే ముందు: పరీక్ష రాసే రోజున పరీక్ష సమయానికి కనీసం రెండు గంటల ముందుగానే చదవడం ఆపేయాలి. పరీక్షకు వెల్లే ముందు ఒత్తిడితో చదివితే కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ తగ్గిపోయే అవకాశం ఉంది. పరీక్షకు వెల్లేటపుడు దారిలో ఆటోలో, బస్సులో, కారులో, బైక్‌ వెనకాల కూర్చొని చదవకూడదు.కంగారు పడొద్దు: పరీక్షకు వెల్లే ముందు చదవని అంశాలు గుర్తుకు వచ్చి కంగారు పడుతుంటారు. మనం పరీక్షకు వెల్లేది నేర్చుకునేందుకు కాదు రాయడానికి మాత్రమేనని మనకు మనం మనస్సుకు సూచించుకోవాలి.

ఉల్లాసంగా ఉండాలి: పరీక్ష హాలు వద్దకు వెల్లాక మనకు నచ్చిన మిత్రులతో , పాజిటివ్‌ దృక్పథంతో ఉన్నవారితో మాత్రమే మాట్లాడాలి. ఏదైనా జోక్‌ తో గాని, గతంలో జరిగిన మంచి సంఘటనను మననం చేసుకోవాలి.బ్రీత్‌ ఎక్షర్‌ సైజ్‌ :  గదిలో ఒత్తిడి ఎక్కువైతే (బ్రీత్‌ ఎక్షర్‌ సైజ్‌ ) కళ్లు మూసుకొని ముక్కు ద్వారా గట్టిగా శ్వాస పీల్కుకొని నోటితో వదలాలి. ఐదు లేదా ఆరు సార్లు చేయడం వల్ల సాధారణ స్థితికి వస్తారు. అలానే గతంలో బాగా రాసిన పరీక్ష సంఘటనలు గుర్తుకు తెచ్చుకోవడం చేయాలి. దుస్తుల విషయం:  ఒంటికి ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఎండలు ఎక్కువగా ఉంటే వదులుగా ఉండే దుస్తులు, కాటన్‌ దుస్తులకు ప్రాధాన్యతను ఇవ్వాలి. విశ్వాసం: జవాబులు గుర్తుకు వస్తాయో లేదోనని ఆందోళన నుంచి బయట పడేందుకు ఇలాంటి పరీక్షలు ఎన్నో రాశాను నా జ్ఞాపకశక్తి నాకు సహకరించింది మంచి మార్కులు తెచ్చుకోవడానికి నా మెదడు ఉపయోగ పడిరది. కాబట్టి నా మీద నాకు , నా మెదడు శక్తి పైన నాకు నమ్మకం, విశ్వాసం ఉంది.

 -డా.అట్ల శ్రీనివాస్‌ రెడ్డి
స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ రిహాబిలిటేషన్‌
సైకాలజిస్ట్‌ ఫ్యామిలీ కౌన్సెలర్‌
9703935321

Leave a Reply