Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్‌ ‌విస్తరణ

దావోస్‌ ‌వేదికగా కెటిఆర్‌తో చర్చించిన ప్రతినిధులు

హైదరాబాద్‌,‌ మే 27 : ‌దావోస్‌లో కెటిఆర్‌ ‌పర్యటనతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా
జర్మనీకి చెందిన జెడ్‌ఎఫ్‌ ‌సంస్థ హైదరాబాద్‌లో విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌ ‌వేదికగా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. 3 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ విస్తరణ ప్రణాళికలను చేపట్టనుంది.

- Advertisement -

నానక్‌రాంగూడలో కొత్త మొబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మొబిలిటీ కేంద్రాన్ని జూన్‌ 1‌వ తేదీన ప్రారంభించనున్నారు. ప్రపంచంలో 100 ఏరియాల్లో, 18 మేజర్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సెంటర్లలో తమ కార్యకలాపాలను జెడ్‌ఎప్‌ ‌సంస్థ కొనసాగిస్తోంది. జెడ్‌ఎఫ్‌ ‌సంస్థకు కేటీఆర్‌ ‌ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply