Take a fresh look at your lifestyle.

దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కొరోనా

24 గంటల్లో 23,285 పాజిటివ్‌ ‌కేసులు నమోదు
దేశంలో కొరోనా విజృంభణ కొనసాగుతోంది. గురువారం 22వేలకుపైగా పాజిటివ్‌ ‌కేసులు నమోదవగా.. శుక్రవారం భారీగా పెరిగాయి. కొద్దిరోజులుగా మళ్లీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 23,285 పాజిటివ్‌ ‌కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 1,13,08,846కు పెరిగింది. కొత్తగా 15,157 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,09,53,303 మంది కోలుకున్నారని మంత్రిత్వశాఖ పేర్కొంది. మరో 117 మంది వైరస్‌ ‌ప్రభావంతో మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,58,306కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,97,237యాక్టివ్‌ ‌కేసులున్నాయని చెప్పింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ ‌కేసులు 1.74శాతం ఉన్నాయని, రికవరీ రేటు 96.86 శాతం ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే డెత్‌ ‌రేటు 1.40శాతంగా ఉందని వివరించింది. టీకా డ్రైవ్‌లో భాగంగా 2,61,64,920 డోసుల వ్యాక్సిన్‌ ‌వేసినట్లు వివరించింది.

ఆరు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు
దేశంలో కొరోనా మహమ్మారి రెండో దశ ఉధృతి రోజురోజుకు మరింత పెరుగుతున్నది. శుక్రవారం ఉదయానికికల్లా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 23,285 మందికి కొరోనా పాజిటివ్‌ ‌వచ్చింది. 117 మంది కొరోనా బాధితులు మృతిచెందారు. అయితే ఈ 23 వేల పైచిలుకు కొత్త కేసుల్లో మెజారిటీ కేసులు కేవలం ఆరు రాష్టాల్లోన్రే నమోదయ్యాయి. కొత్త కేసుల్లో 85.6 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, ‌కర్ణాటక, గుజరాత్‌, ‌తమిళనాడు రాష్ట్రాల్లోనే బయటపడ్డాయని, ఆ ఆరు రాష్ట్రాల్లో కొరోనా వైరస్‌ ‌వేగంగా విస్తరిస్తున్నదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అందుకే ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ ‌విస్తరిస్తున్న తీరు, చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలపై తాము నిరంతర సవి•క్షలు నిర్వహిస్తున్నామని కేంద్ర సర్కారు తెలిపింది.

తెలంగాణలో కొత్తగా 181 కేసులు నమోదు
తెలంగాణలో కొత్తగా 181 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కొరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 181 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ ‌విడుదల చేసింది. రాష్ట్రంలో గురువరాం కొరోనా తో ఒకరు మరణించారు. కొరోనా బారి నుంచి నిన్న 163 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయని, వారిలో 733 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎం‌సీలో కొత్తగా 44 కొరోనా కేసులు నమోదయ్యాయి.

Leave a Reply