Take a fresh look at your lifestyle.

పంజాబ్ లోకల్ రైతులు వలస కార్మికులకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు ..! కేంద్రం రాష్ట్ర కార్యదర్శి,డీజీపీ కి లేఖ

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ పోలీసు డిజిపికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో పంజాబ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని రైతులు బయట నుండి వచ్చి పంజాబ్ లో పని చేస్తున్న వలస లార్మికులకి మాదకద్రవ్యాలు ఇస్తున్నారు అని ఉంది. మార్చి 17 నాటి ఈ లేఖలో పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతాల రైతులు యూపీ, బీహార్‌కు చెందిన వలస కార్మికులకు మాదకద్రవ్యాల అలవాటు పంజాబ్ రైతులు చేస్తున్నారు అనే కేంద్ర హోమ్ శాఖ ఆరోపించింది.
MHA లేఖ ప్రకారం,పంజాబ్ లో వలస కార్మికులు తరచూ మత్తుపదార్థాలు తీసుకుని పొలాల్లో పనిచేసేలా పంజాబ్ లోకల్ రైతులు ఏర్పాట్లు చేస్తారు.

“నియమిత పని కంటే ఎక్కువ పని చేసిన తరువాత కూడా వలస కార్మికులకు వేతనాలు పంజాబ్ లోకల్ రైతులు వలస కూలీలకు ఇవ్వటం లేదు. పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో పొలాల్లో పనిచేస్తున్న ఈ కార్మికుల్లో ఎక్కువమంది యూపీ, బీహార్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేద కుటుంబాల వలస కార్మికులు. మానవ అక్రమ రవాణా ముఠాలు ఇలాంటి కూలీలను మంచి జీతాలు ఇప్పిస్తామని ఆకర్షించడం ద్వారా పంజాబ్‌కు తీసుకువస్తాయి. ఒకసారి ఈ వలస కార్మికులు పంజాబ్‌కు చేరుకున్న తరవాత దోపిడీకి గురవుతారు. వీరిని అమానుషంగా లోకల్ పంజాబ్ రైతులు చూస్తారు. సరిహద్దు జిల్లాలైన గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్ మరియు అబోహర్‌లలో యుపి, బీహార్ నుంచి వచ్చే వలస కార్మికులను బంధీలుగా చేసి వారితో పనిచేయించుకుంటుండగా బిఎస్‌ఎఫ్ జరిపిన తనిఖీ విచారణ ఆధారంగా ఈ లేఖ రాశామని హోమ్ శాఖ తెలిపింది.

గత రెండేళ్లలో బిఎస్‌ఎఫ్ 58 మంది బందీ కార్మికులను వెలికి తీసి పంజాబ్ పోలీసులకు అప్పగించింది. అయితే బీఎస్ఎఫ్ ఈ నివేదికను ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు. పంజాబ్ డిజిపి ఈ విషయమై ఎంహెచ్‌ఎకు నివేదిక సమర్పించాలని కోరినట్లు పంజాబ్ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది అయితే లేఖతో పాటు వాస్తవ పత్రాలు లేదా ఆరోపణలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించలేదని పంజాబ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.పంజాబ్ సెంటర్ గా ఢిల్లీ సరిహద్దులలో మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ మరియు హర్యానా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్ర హోమ్ శాఖ ఈ లేఖ రాసింది. వలస కార్మికుల పరిస్థితి పెద్దరైతుల పంచన ఎలా ఉంది అని తెలిపేలా ఈ లేఖ ఉంది. పెద్ద రైతులు అంతమై కార్పొరేట్ కంపెనీలు హయాంలోకి వలస కార్మికులు పొతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అంచనా వేయాలి అంటే మనం కరోనా కాలంలో వలసకార్మికుల పరిస్థితిని అధ్యయనం చేయాల్సిందే.

Leave a Reply