Take a fresh look at your lifestyle.

హూజూరాబాద్‌కు మెడికల్‌ ‌కాలేజ్‌..!

  • రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ ‌రావుగా నేను హమీ ఇస్తున్నా….
  • సిఎం కేసీఆర్‌ ఆశీస్సులతో ఫ్లడ్‌ ‌లైట్ల స్టేడియం….లైబ్రరీ….ఇంటిగ్రేటెడ్‌ ‌వెజ్‌-‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్‌…‌మహిళా భవనాలు
  • సిద్దిపేట-కరీంనగర్‌ ‌తరహాలో హూజూరాబాద్‌ అభివృద్ధి
  • హుజూరాబాద్‌టెన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌ ‌రావు

హుజూరాబాద్‌లో ఒక వారం అయితే ఎన్నికలు అయిపోతది…చివరి దశకు వొచ్చాం. ఏ తోవలో వెళ్తే పేదలకు, హుజూరాబాద్‌ ‌ప్రజలకు మేలు అవుతుందో ఆలోచించాలని, మనకు అన్నం పెట్టే చేయి ఏదో గుర్తించాలని శనివారం ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ ‌రావు వోటర్లకు విజ్ఞన్తి చేశారు. కాంగ్రెస్‌ అసలు లేదని, ఉన్నది టీఆర్‌ఎస్‌-‌బీజేపీలేనని, టీఆర్‌ఎస్‌ ‌నుంచి నేను, మంత్రి కమలాకర్‌ ‌పని చేస్తున్నమని, బీజేపీకి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ ‌వొస్తున్నరని హుజూరాబాద్‌కు వాళ్లేమైనా చేశారా అని ఆయన ప్రశించారు. వట్టి మాటలు కట్టి పెట్టు..గట్టి మేలు  తలపెట్టు అని గురజాడ అన్నట్టు బీజేపీ మంత్రులు వట్టి మాటలు మాట్లాడుతున్రని అన్నారు. తాము హుజూరాబాద్‌కు వొచ్చి మూడు నాలుగు నెలలవుతుందని, ఈ కాలంలో తాము కొన్ని పనులు చేశామని, మరి కేంద్ర మంత్రులు వొచ్చి ఏమైనా పనులు చేశారా అని హరీష్‌ ‌రావు ప్రశించారు.

అభివృద్ధి పనులు ముందుకు సాగాలా వద్దా ఆలోచించుకోవాలని వోటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈటల గెలిచేది లేదని, గెలిచినా మంత్రి అయ్యేది లేదు…ప్రభుత్వం వొచ్చేది లేదని, అయినా మంత్రిగా ఉన్ననాడే రాజేందర్‌ ‌పట్టించుకోలేదని, రేపు మంత్రి అయ్యేదే లేనప్పుడు ఏ రకంగా మేలు అవుద్దని హరీష్‌ ‌రావు ప్రశించారు. ఆయన చేరిన పార్టీ బీజేపీ పార్టీ అని, మనది టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అంటూ అమ్మకాల పార్టీ బీజేపీ..నమ్మకాల పార్టీ టీఆర్‌ఎస్‌ అని అన్నారు. ఆనాడు తెలంగాణ రాదే రాదు అన్నరు…కాదనుకున్న తెలంగాణ కేసీఆర్‌ ‌తెచ్చిండా, లేదా..200 రూ పెన్షన్‌ 2016 ‌చేస్తాం అన్నం. అయిందా లేదా..ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు వొస్తున్నయా లేదా..కాన్పుకు పేదింటి ఆడపిల్ల వెళితే కాన్పు ఉచితంగా చేసి 12 వేల రూపాయలు ఇస్తున్నరా లేదా అని వోటర్లానె ప్రశ్నించారు. కాళేశ్వరం నీరు వొచ్చిందని, గెల్లు శ్రీనును గెలిపించాలని, రేపు మీకు 57 ఏళ్లకే పెన్షన్‌ 2016 ‌రూ. ఇస్తమని, రైతుకు లక్ష రూ. దాకా  అప్పులు మాఫీ చేస్తామని, స్వంత జాగాలో ఇళ్లు కట్టుకునేందుకు 5 లక్షల 4 వేల రూపాయలు ఇస్తమని హరాష్‌ ‌రావు హామీ ఇచ్చారు.

ఇవతకు ముందు చాలా మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు..కాని పట్టాలు ఇవ్వలేదని, కానీ తాము దాదాపు 500 మందికి  ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పట్టాలు ఇచ్చినమని ఆయన అన్నారు. రాజేందర్‌ ఏడేళ్లు మంత్రిగా ఉన్నా…ఒక్క పేదవాడికి ఇల్లు కట్టలేదని, గెల్లును గెలిపిస్తే 5 వేల డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తమని, ఒక్క సారి ఆలోచించండని అన్నారు. 30వ తేదీన వోట్లు అయ్యాక సీఎంగా కేసీఆర్‌ ఉం‌టరు…మీ దయ కేసీఆర్‌ ‌దయ ఉంటే ఆర్థిక మంత్రిగా నేనుంటా, జిల్లా మంత్రిగా కమలాకర్‌ ఉం‌టరు…కాబట్టి కెసిఆర్‌ అశిస్సులతో తాము చెప్పినవన్నీ చేస్తామని అన్నారు.

రాజేందర్‌ ‌తన స్పీచ్‌లో తాను ఇది చేసిన..గెలిస్తే ఇది చేస్తా అని చెప్పడం లేదని, బీజేపీ పార్టీ జూటా పార్టీ అని..కూలగొడతా, అగ్గిపెడతా, బొంద పెడతా అంటూ తిట్లు తిడుతున్నరని హరీష్‌ ‌రావు ఎద్దేవా చేశారు. ఇది పేదవాళ్ల కడుపు నిండుతదా అని అన్నారు. ఆయన చేతిలో ఏం లేదు కనుక  ఈ మాటలు మాట్లాడుతున్నారని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని, ఆవేశంలో, ఆవేదనలో తన పని  అయిందని మాట్లాడుతున్నరని, అన్ని సర్వేల్లో గెల్లు గెలుపు ఖాయం ఖాయం అంటున్నరని, యువత అంతా గెల్లును, విద్యార్థి నేతను గెలిపిస్తమంటున్నరని, మహిళలు కేసీఆర్‌ ‌కారుకే తమ వోటు అంటున్నరని ఆయన అన్నారు. మా హుజూరాబాద్‌కు మెడికల్‌ ‌కాలేజి వొస్తే బాగుండని అడుగుతున్నరని, ఎంజీఎం లాంటి పెద్ద దవాఖానా వొస్తే పేదలకు ఉచిత వైద్యం దొరుకుతుందంటున్నరని, ఇది గెల్లుతో సాధ్యమని, మేమంతా సీఎం దగ్గరకు వెళ్లి మెడికల్‌ ‌కాలేజి సాధిస్తామని, ప్రతీ జిల్లాకు ఓ మెడికల్‌ ‌కాలేజి ఇవ్వాలని సీఎం  నిర్ణయించకున్నరని, పెద్ద దవాఖానా ఈ  ప్రాంతంలో కట్టించుకుందామని, మన చెరువు మోడల్‌ ‌చెరువుగా తీర్చిదిద్దుతామని హరీష్‌ ‌రావు క్ష్మీఆమీ ఇచ్చారు. పిల్లల చదువులకు ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్ ‌పెట్టి చదివిస్తున్నరని, ఈటల రాజేందర్‌ ‌బీజేపీ పార్టీ ఎం ఇచ్చిందని అన్నారు.

పేదలను దంచి బీజేపీ పెద్దలకు పంచిందని, గ్యాస్‌ ‌సబ్సిడీని 250 నుంచి 40 రూపాయలకు తగ్గించిండ్రని, ఇక్కడ తిరుగుతున్న కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డిని  సబ్సిడీ ఎందుకు తగ్గించారో అడగండని అన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ అక్కా చెల్లెల్ల పక్షాన తాని అడుగుతునానని, పెంచిన సిలిండర్‌ ‌ధరను 500కు తగ్గిస్తమని చెప్పినాకే వోట్లు అడగాలని, సబ్సిడీని ఎప్పటి లాగే 250 ఇచ్చినంకనే వోట్లు అడగాలని, లేదంటే అక్కా చెల్లేల్లు బీజేపీకి వోటు వేయ్యరు గాక వెయ్యరని నొక్కి చెప్పారు హరీష్‌ ‌రావు. బీజేపీ సిలిండర్‌ ‌ధరను వెయ్యి రూపాయలు చేసిందని, అయినా హుజూరాబాద్‌లో ఇంకా బీజేపీకి వోటు వేస్తే వేయి రూపాయలు చేసినా మాకే వోటు వేసిండ్రు…1500 రూ చేయమన్నటా… సబ్సిటీ ఎగబెట్టమన్నట్టా అని అన్నారు. పెట్రోల్‌ ఇవాళ కూడా 32 పైసలు పెంచారని, దీని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతున్నరని, అయినా బీజేపీకి ఇంకా వోటు వేద్దామా అని ప్రశ్నించారు.

రైల్వేలో 4 లక్షల ఉద్యోగాలున్నాయని, అవి నింపమంటే రైల్వేలను అమ్ముతున్నరని, బీఎస్‌ఎఎన్‌ఎల్‌లో  ఉద్యోగాలు నింపమంటే 50 వేల ఉద్యోగాలు ఊడగొట్టి, దాన్నీ అమ్ముతున్నరని, బడా బడా కంపెనీలకు పది లక్షల కోట్లు మాఫీ చేసిండ్రని, బ్యాంకులకు అప్పులు ఎగనామం పెట్టిన వారికి వేల కోట్లు మాఫీ చేసిండ్రని, ప్రజలను మాత్రం డీమానిటైజేషన్‌ అని బ్యాంకుల వద్ద నిలబెట్టిండ్రని, ప్రధాని మోడీ నెల రోజులు ఆగండి అచ్చే దిన్‌ ఆయేగా అన్నడని..చివరకు చచ్చే దిన్‌ ‌వచ్చిందని, ఇంట్లో పైసలన్నీ బయటపడ్డాయని ఎద్దేవా చేశారు. జీరో అక్కౌంట్లు తీయమన్నరని, ధనా ధన్‌ ‌జన్‌ ‌ధన్‌ అక్కౌంట్లు తీయండని, నల్ల ధనం వేస్తమన్నరు ఒక్క రూపాయి వొచ్చిందా…విదేశాల నుంచి నల్లధనం తెస్తా అన్నరు.. వొచ్చినయా అని ప్రశఙ్నంచారు.బిజెపివి అన్నీ గోబెల్స్ ‌ప్రచారాలని హరీష్‌ ‌రావు అన్నారు.

Leave a Reply