Take a fresh look at your lifestyle.

కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతుల భవనాన్ని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 1: కందుకూరు రెవెన్యూ పరిధిలోని కొత్తగూడలో నిర్మించిన కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతుల భవనాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,విద్యాలయాలకు కేరాఫ్ గా మహేశ్వరం నియోజకవర్గం నిలచిందని ఆమె పేర్కొన్నారు.మహేశ్వరం నియోజకవర్గంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా అభివృద్ధి చెందుతుందని మహేశ్వరం,కందుకూరులు విద్యాలయాలకు నిలయాలుగా మారాయని మంత్రి తెలిపారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ పాఠశాలలు,డిగ్రీ కళాశాల,న్యాయకళాశాల,గురుకుల పాఠశాలలు,తదితర విద్యాభివృద్ధి ఈప్రాంతంలో జరగడం శుభపరిణామని మంత్రి తెలియజేశారు.పేద విద్యార్థులకు అనుకూలంగా ఈ ప్రాంతం మారిందని ఇన్ని వసతులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసమేనని మంత్రి తెలిపారు. ఇప్పటికైనా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు వేద విద్యార్థులు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలలో చదువుకోవాలని వారికి మంత్రి సూచించారు.అన్ని సౌకర్యాలతో కళాశాలలను నిర్మిస్తున్నామని అధ్యాపకులను సైతం పూర్తిస్థాయిలో నియమిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపకులు బిఆర్ఎస్ నాయకులు అమరేందర్ రెడ్డి,గోపాల్ రెడ్డి,సామ ప్రకాశ్ రెడ్డి,తల్లోజు లక్ష్మణాచారి,బొక్క దీక్షిత్ రెడ్డి,తాళ్ల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply