Take a fresh look at your lifestyle.

తరగతి గది

పాఠాలు జెప్పే సార్లం
పిల్లవాని కళ్ళలోకి జూసి
కష్టం సుఖం తెలుసుకొని
మనసు బాగా లేక మనాదిల బడ్డొళ్ళను మందలించి
తరగతి గదిని పాఠానికి సంసిద్దులుగా చేసేవాళ్ళం

భిన్న మస్తిష్కాల పుట్టలాఉండే
తరగతి గదిలో
పాఠం జెప్పడమంటే ఆటవిడుపా

అది ఓ రసాయనశాల
చర్య ప్రతిచర్య ల సమాహారంగా సాగే చర్చా వేదిక

దేశ భవిష్యత్తు చిత్రపటాన్ని
కళ్ళమందు నిలబెట్టే మేధో కర్మాగారం.

అలాంటి
తరగతి గది నేడు
కాలం విసిరిన సవాలుకు గాలానికి చిక్కిన చేపలా
గిలగిల కొట్టుకొంటుంది

రంగుల సీతాకోకచిలకల్లా
కలకలలాడే గదులన్నీ
కళదప్పి కన్నీరొలుకుతున్నయ్‌.

‌బెల్లుమోగ గానే సుద్దముక్కతో
సిద్దంగా  ఉండి పాఠంలో పరకాయ ప్రవేశం చేసే
పంతుళ్ళ గొంతులు మూగగా రోదిస్తున్నవి

అరకొర సౌకర్యాల మధ్య అతికించుకున్న
కృత్రిమ వేష అన్‌లైన్‌ ‌క్లాసులు
స్మార్టఫోన్లు కరువైన సర్కారు బడిపిల్లల సదువులు
అంతరాల దొంతరలు పెరిగిన
ఆధునిక యుగంలోను
అవస్థల గ్రహపాటే.

సమాన అవకాశాలు ఎట్లాగు లేవు
సామాన్యుడు తలెత్తుకుని బతికే
సమాన విద్యకై కామన్‌ ‌స్కూల్‌ ‌విధానమైన ముందుకు తెండి
కలలు సాకారం కావాలంటే
ఇంతకంటే ప్రత్యామ్నాయమేముంది.
గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి, 9494789731

Leave a Reply