Take a fresh look at your lifestyle.

త్వరలోనే మానవులపై క్లినికల్‌ ‌ట్రయల్స్

ఐసిఎంఆర్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌బలరామ్‌ ‌భార్గవ వెల్లడి

ఈ నెలలోనే మానవులపై దేశీయ కొరోనా వ్యాక్సిన్‌ ‌తొలి దశ ట్రయల్స్ ‌మొదలవుతాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌బలరామ్‌ ‌భార్గవ తెలిపారు. భారత్‌లో రెండు దేశీయ కొరోనా టీకాలపై పరిశోధనలు జరుగుతున్నాయని మంగళవారం ఆయన చెప్పారు. ఎలుకలు, కుందేళ్లపై అధ్యయనాలు విజయవంతమయ్యాయని, ఆ నివేదికలను డ్రగ్‌ ‌కంట్రోలర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా(డీసీజీఐ)కు పంపినట్లు బలరామ్‌ ‌తెలిపారు. ఈ నేపథ్యంలో మానవులపై తొలిదశ ప్రయోగాలకు ఆమోదం లభించిందని, ఈ నెలలోనే క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌ప్రారంభమవుతాయన్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు వెయ్యి మంది ఔత్సాహికులపై రెండు దేశీయ కొరోనా టీకాలపై మానవ అధ్యయనాలు జరుగుతాయని బలరామ్‌ ‌తెలిపారు. రష్యా, చైనా దేశాలు ఇప్పటికే వేగవంతమైన టీకాల తయారీపై పరిశోధనలు చేశాయని, తొలి దశ ప్రయోగాల్లో అవి విజయం సాధించాయని ఆయన చెప్పారు. తాజాగా అమెరికా కూడా వేగవంతమైన పద్ధతిలో రెండు కొరోనా టీకాలపై పరిశోధనలు చేస్తున్నదని, బ్రిటన్‌ ‌కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నదని ఐసీఎంఆర్‌ ‌డీజీ బలరామ్‌ ‌భార్గవ వివరించారు.

Leave a Reply