Take a fresh look at your lifestyle.

ఎన్నికలనే నాటకాన్ని రక్తి కట్టిస్తున్న ఐటీ సెల్‌, ‌వాట్సప్‌ ‌యూనివర్సిటీలు

“ప్రైవేటు సంస్థలు, సోషల్‌ ‌మీడియా సంస్థలు, కూడా ట్రంప్‌ అబద్ధాల వేటలో తమ వంతు  ప్రయత్నాలు ముమ్మరంగా చేశాయి. అడ్వాన్స్ ‌డెమోక్రసీ అనే సంస్థ ప్రకారం నవంబర్‌ ఐదు నాడు ట్విట్టర్‌ ‌ప్లాట్‌ఫా•ంలో పది హాష్‌ట్టాగ్స్ ‌ట్రెండ్‌ అయినాయి. అందులో మూడు ఎన్నికలలో అవకతవకలకు ఆస్కారం ఇచ్చేవిగా వున్నాయి. ట్రెండ్‌ అయిన పది హాష్టాగ్స్‌లో ఏడు రైట్‌ ‌వింగ్‌ ‌పోస్ట్ ‌చేసినవని ప్రకటించింది. దీన్ని అమెరికా మెయిన్‌ ‌స్ట్రీమ్‌ ‌మీడియా ఫుల్‌ ‌కవర్‌ ‌చేసింది. పర్యవసానంగా అమెరికా ఎన్నికలలో అబద్ధాలను ఆడుకోవటానికి ట్విట్టర్‌ ఓ ‌సోషల్‌ ‌మీడియా సంస్థగా ఏమి చేయనున్నదీ ప్రకటించుకోవలసి వొచ్చింది.”

ప్రపంచం రెండు మహా నాటకాలను చూ సింది. ఒకటి అమెరికాలో, మరోటి భారత దేశంలో. రెండు నాటకాల సబ్జెక్ట్ ఒకటే.. ఎన్నికలు. ఎన్నికలు అంటే ప్రజలు..వారి ఆకాంక్షలు కాదని మనకి ఈ సరికే తెలిసిన నేపథ్యంలో డిజిటల్‌ ‌యుగంలో ఈ డ్రామాని రచించింది ఎవరనేది మనకు అతి ముఖ్యం. మన ఎన్నికలలో ఐటీ సెల్‌, ‌వాట్సప్‌ ‌యూనివర్సిటీ పోషిస్తున్న పాత్ర మనకి తెలుసు. ఈ నేపథ్యంలో ఫేస్‌ ‌బుక్‌..‌గూగుల్‌..‌ట్విట్టర్‌..ఇం‌స్టాగ్రామ్‌..అమెజాన్‌ ‌విశ్వవ్యాపిత కంపెనీల హెడ్‌ ‌క్వార్టర్స్ ‌గడ్డలో ఈ కంపెనీలు ఎలా ఎన్నికల నాటకాన్ని రక్తి కట్టించాయో చూద్దాం.

2016 కేంబ్రిడ్జ్ అనలైటీకా ఎన్నికలలో ట్రంప్‌• ‌గెలుపుకి కారణం అబద్ధం అని నిర్ధారణ జరిగాక..ప్రపంచం మొత్తం అబద్ధం అనేది ఎన్నికలలో రాజ్యం ఏలుతున్నదనేది గుర్తించటం జరిగింది. దీనిపై పెద్ద చర్చ జరిగింది..జరుగుతున్నది. అయితే ఈ చర్చలో భారత దేశం ఓ మినహాయింపు అనే చెప్పాలి. భారత దేశంలో వాట్సప్‌ ‌యూనివర్సిటీ, ఐటీ సెల్‌ అనే అబద్దాల అడ్డాలు.. ఎన్నికలలో పోషిస్తున్న పాత్ర ఎన్నికల గతిని ఎలా  మార్చుతున్నది మనకి తెలియనిది కాదు. ఇక ఈ అబద్ధాలను ఎలా ట్రేస్‌ ‌చేసే అవకాశం వుందనేదానికి ఈ అబద్దాలను సునాయాసంగా వ్యాప్తిచేసే కంపెనీలకు అడ్డా అయిన అమెరికా దేశమే ఓ ఉదాహరణ మనముందు పెట్టింది.  20 జనవరి 2017 నుంచి ట్రంప్‌ ‌పలికిన ప్రతి అబద్ధం.. దానికి నిజం ఏమిటి అనేది అమెజాన్‌ ‌కంపెనీ వారి వాషింగ్టన్‌ ‌పోస్ట్ ‌తన వెబ్‌ ‌సైట్‌లో నమోదు చేసి ప్రజల ముందు పెట్టింది. ఇది  ప్రపంచ పౌరులకు అందుబాటులో ఉండేలాగా అమెరికా పౌరునికి స్పష్టంగా అర్థం అయ్యేలాగా వాషింగ్టన్‌ ‌పోస్ట్ ‌వెబ్‌ ‌సైట్‌ ‌ప్రణాళిక వేసి డిజైన్‌ ‌చేసింది. వాషింగ్టన్‌ ‌పోస్ట్ ‌వెబ్‌ ‌సైట్‌లో 27 ఆగస్టు 2020 వరకు ట్రంప్‌ ‌చెప్పిన అబద్ధాల మొత్తం జాబితా మనకు కనిపిస్తుంది. ఈ జాబితా ప్రతి రెండు నెలలకు ట్రంప్‌ ‌మాట్లాడిన అబద్ధాల జాబితాను అప్డేట్‌ ‌చేస్తూ వచ్చింది. ఈ జాబితా ప్రకారం 1316 రోజులలో అమెరికా ప్రెసిడెంట్‌గా ట్రంప్‌ 22247 అబద్ధాలు చెప్పారని నమోదై ఉంది. వాషింగ్టన్‌ ‌పోస్ట్ ‌వెబ్‌ ‌సైట్‌, ‌ట్రంప్‌ ‌చెప్పిన అబద్ధాలు వివిధ కేటగిరీలుగా విభజించి చూపుతుంది. ఈ కేటగిరీలు ఇలా ఉంటాయి ఫేక్‌..‌ఫాల్స్..‌మిస్‌ ఇన్ఫర్మేషన్‌..‌ఫ్రాడ్యూలెంట్‌..ఈ ‌జాబితా చుస్తే ట్రాంప్‌ ఏ ‌విషయాలపై ఎక్కువ అబద్ధాలు చెబుతారనేది స్పష్టంగా అర్థం అవుతుంది.  అంతేకాదు ఓ రోజులో, ఓ వారంలో, ఓ నెలలో, ఎన్ని అబద్దాలు చెబుతారనేది కూడా  అమెరికా వోటరుకి స్పష్టంగా అర్థమయ్యేలాగా వాషింగ్టన్‌ ‌పోస్ట్ ‌వెబ్‌ ‌సైట్‌లో ఈ జాబితా కనబడుతుంది. అమెరికా అధ్యక్ష పదవి కోల్పోతాననిపించినప్పుడల్లా ట్రంప్‌ అబద్ధాల యాక్సిలరేటర్‌ ‌నొక్కి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పరిస్థితి యెంత దిగజారిందంటే ట్రంపు వైట్‌హౌజ్‌లో కూర్చుని ప్రెస్‌ ‌కాన్ఫరెన్స్ అ‌డ్రెస్స్ ‌చేస్తూ ఉంటే అమెరికా న్యూస్‌ ‌ఛానల్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌  ‌మాట్లాడుతున్న దానిలో వాస్తవాలను గమనించాల్సి ఉందని చెప్పి లైవ్‌ ‌నిలిపివేసిన సంఘటనలు అమెరికాలో చోటు చేసుకున్నాయి. అసోసియేట్‌ ‌ప్రెస్‌ ‌ప్రకారం ఏబిసి, సిబిఎస్‌, ఎన్‌ఎస్‌బి న్యూస్‌ ‌ఛానల్స్ ‌ట్రంప్‌ ‌లైవ్‌ ‌ప్రెస్‌ ‌కాన్ఫరెన్స్ ‌లను మధ్యలో నిలిపివేసాయి. అధ్యక్ష ఎన్నికలలో అవకతవకలు జరిగాయని ట్రంప్‌ ఆరోపిస్తున్న సమయంలో రాష్ట్రపతి మాట్లాడుతున్న విషయాలు చెక్‌ ‌చేయాల్సి ఉందని చెప్పి ఈ న్యూస్‌ ‌చానల్స్ అన్నీ కూడా లైవ్‌ ‌ప్రసారం నిలిపి వేయడం జరిగింది.

ఇక సిఎన్‌ఎన్‌ ‌ఛానల్‌ అయితే ఏకంగా ట్రంప్‌ ‌చెబుతున్న మాటలు పూర్తి అవాస్తవాలు.. అబద్ధాలు.. అని ప్రకటించింది. విస్కాన్సిన్‌, ‌పెన్సిల్వేనాయ, మిచిగాన్‌, ‌జార్జియా గెలిచానని  ట్రంప్‌ ‌ప్రకటించగానే సిఎన్‌ఎన్‌ ‌ట్రంప్‌ అబద్దం చెప్పారని వెనువెంటనే ప్రసారం చేసింది. మొత్తం ట్రంప్‌ ‌మాట్లాడిన 16 నిమిషాల ప్రెస్‌ ‌కాన్ఫరెన్స్‌లో 16 అబద్ధాలను అప్పటికప్పుడే  ఛానల్‌ ‌పట్టుకుని ప్రేక్షకుల ముందు బట్టబయలు చేసింది. పరిస్థితి ఎంతగా శృతి మించిందంటే ట్రంప్‌ ‌మాట్లాడిన దానిపైన సొంత పార్టీలోనే వ్యతిరేకత వొచ్చింది. రిపబ్లిక్‌ ‌పార్టీలో ఉన్న మాజీ అటార్నీ జనరల్స్  ‌రాష్ట్రపతి ట్రంప్‌ ‌మర్యాద, మన్ననతో  వ్యవహరించాలని హెచ్చరించిన సమయాలు ఈసారి అమెరికా ఎన్నికలలో చోటు చేసుకున్నాయి. ఎప్పటికప్పుడు ట్రంప్‌ అబద్ధాలను పట్టుకోవటానికి మీడియా సంస్థలు చేసిన ప్రయత్నాలు ఇలా కొనసాగాయి. మొత్తంగా అమెరికా ఎన్నికలు చుస్తే ట్రంప్‌ ‌చెప్పిన అబద్ధాల వేట అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రైవేటు సంస్థలు, సోషల్‌ ‌మీడియా సంస్థలు, కూడా ట్రంప్‌ అబద్ధాల వేటలో తమ వంతు  ప్రయత్నాలు ముమ్మరంగా చేశాయి. అడ్వాన్స్ ‌డెమోక్రసీ అనే సంస్థ ప్రకారం నవంబర్‌ ఐదు నాడు ట్విట్టర్‌ ‌ప్లాట్‌ఫా•ంలో పది హాష్‌ట్టాగ్స్ ‌ట్రెండ్‌ అయినాయి. అందులో మూడు ఎన్నికలలో అవకతవకలకు ఆస్కారం ఇచ్చేవిగా వున్నాయి. ట్రెండ్‌ అయిన పది హాష్టాగ్స్‌లో ఏడు రైట్‌ ‌వింగ్‌ ‌పోస్ట్ ‌చేసినవని ప్రకటించింది. దీన్ని అమెరికా మెయిన్‌ ‌స్ట్రీమ్‌ ‌మీడియా ఫుల్‌ ‌కవర్‌ ‌చేసింది. పర్యవసానంగా అమెరికా ఎన్నికలలో అబద్ధాలను ఆడుకోవటానికి ట్విట్టర్‌ ఓ ‌సోషల్‌ ‌మీడియా సంస్థగా ఏమి చేయనున్నదీ ప్రకటించుకోవలసి వొచ్చింది.  26 మే నాడు మొదటి సారి ట్విట్టర్‌ ‌ట్రంప్‌ ‌ట్వీట్‌ ‌కింద బ్లూ లైన్‌ ‌లేబుల్‌ ‌పోస్ట్ ‌చేసి యూజర్‌ ‌కీ లెర్న్ అని సలహా ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్వీట్లో నిజం ఎంత అనేది సిఎన్‌ఎన్‌ ఇతర న్యూస్‌ ‌ఛానల్స్ ‌ఫాక్ట్ ‌చెక్‌ ‌చేసాయి. అక్కడకి పోయి నిజ నిర్ధారణ చేసుకోండని ట్విట్టర్‌ ‌ప్లాట్ఫార్మ్ ‌తనకి తానుగా చెప్పింది . అమెరికాలో పోస్టల్‌ ‌బ్యాలెట్‌ ‌ను ‘మేల్‌ ఇన్‌ ‌పోస్టల్‌ ‌బ్యాలెట్‌’ అం‌టారు. 26 మే నాడు ‘మేల్‌ ఇన్‌ ‌పోస్టల్‌ ‌బ్యాలెట్‌’ ‌ఫ్రాడ్‌ అని ట్రంప్‌ ‌ట్వీట్‌ ‌చేస్తూ మేల్‌ ‌బాక్స్ ‌లూటీ అవుతాయి, దీని ద్వారా తప్పుడు వోటింగ్‌ ‌జరుగుతుందని చెప్పారు. ట్విట్టర్‌ ఈ ‌ట్విట్‌ ‌పై బ్లూ లైన్‌ ‌లేబుల్‌ ‌చేయగానే ట్రంప్‌ ‌మాట్లాడే స్వేచ్ఛపై ట్విట్టర్‌ ఆం‌క్షలు విధిస్తుందని ట్వీట్‌ ‌చేసారు. అంతేకాదు ఫేక్‌ ‌న్యూస్‌ ‌చూపే సిఎన్‌ఎన్‌ అమెజాన్‌ ‌వాషింగ్టన్‌ ‌పోస్ట్ ‌తో జతకూడిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్కడితో ఆగకుండా  ట్విట్టర్‌ ‌వంటి ప్లాట్‌ఫాంలను రెగ్యులేట్‌ ‌చేస్తాం లేదా బాన్‌ ‌చేస్తాం అనే  ధమ్కీ కూడా ట్రంప్‌ ఇచ్చారు.
ట్విట్టర్‌ ‌సంస్థ దీని వలన మూత పడలేదు. కాకపోతే ట్రంప్‌ అభిమానులు తన ఆఫీస్‌ ‌పైన గన్నులతో దాడి తలపెడతారేమో అని ట్విట్టర్‌ ‌కొంచెం బయపడింది. అవును మరి జర్నలిస్ట్ ‌జోన్‌ ‌నోటన్‌ ‌ప్రకారం అమెరికాలో లైసెన్స్ ‌లేని గన్నులు ముప్పై తొమ్మిది వేలు వున్నాయి కనుక పాపం ట్విట్టర్‌ ఈ ‌విషయంలో భయపడింది. ట్రంప్‌ ‌తన అభిమానులను ట్విట్టర్‌లో ‘‘ఎంగేజ్‌’’  ‌చేసి ఉంచుతారు. ట్విట్టర్‌ ‌వంటి సోషల్‌ ‌మీడియా సంస్థలు  యూజర్స్ ‌వాడుకునే ఈ ‘‘ఎంగేజ్‌ ‌చేయటం అనే ప్రక్రియ’’ వలెనే జెయింట్‌ ‌కంపెనీలుగా ఎదుగుతాయి.

ఇప్పుడు ఎదగటానికి ఉపయోగపడిన ఆ సదరు ‘‘ఎంగేజ్‌ ‌ప్రక్రియ’’ కు ట్విట్టర్‌ ‌వంటి సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫారం హడలి పోయింది. దీన్ని బట్టి మనం మానవ మెదడుకి ఉన్న శక్తి..బలహీనతలను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బీహార్‌ ఎన్నికలలో ఈవీఎంలు కాకుండా వాట్స్ అప్‌ ‌యూనివర్సిటీ..ఐటీ సెల్‌ ఈ ‌మానవ మెదడును ఎలా వాడుకుని ఉండవచ్చ నేది మనం అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
పరిస్థితి ఏ స్థాయికి పోయిందంటే ట్రంప్‌ ‌ట్విట్‌ ‌చేస్తే అందులో అబద్ధం ఉంటే లైక్‌ ‌బటన్‌, ‌రీట్వీట్‌ ‌బటన్‌ ‌ట్విట్టర్‌ ‌డి యాక్టీవ్‌ ‌చేసింది. అంతేనా మీడియా..సోషల్‌ ‌మీడియాల.. మిస్‌ ఇన్ఫర్మేషన్‌ ‌యుగంలో, ‘‘మిస్‌ ఇన్ఫర్మేషన్‌ ‌బస్టింగ్‌ ఎక్సపర్టస్’’ అనే ఉద్యోగాలు అమెరికాలో వెలుగులోకి వొచ్చాయి. అమెరికాలో అమెజాన్‌ ‌వారి వాషింగ్టన్‌ ‌పోస్ట్ ‌వెబ్‌ ‌సైట్‌ ‌ట్రంప్‌ అబద్దాలను గుట్టు రట్టు చేసే నిజాలు వెలుగులోకి తెస్తే.. ట్విట్టర్‌, అమెజాన్‌ ‌వెలుగులోకి తెచ్చిన నిజాలను ప్రమోట్‌ ‌చేయటానికి ముందుకి వొస్తున్నది. ఇలా నవంబర్‌ ‌మూడు నుంచి ట్విట్టర్‌ ‌ట్రంప్‌ అబద్ధాలను ఇప్పటి వరకు 38 శాతం చెక్‌ ‌పెట్టింది. ఎన్నికల ఫలితం రాకుండా గెలిచానని ట్రంప్‌ ‌ట్వీట్‌ ‌చేస్తే ట్విట్టర్‌ ‌ప్లాట్‌ఫాం ఎన్నికల ఫలితాలు వొచ్చాకే విజేత ఎవరో తెలుస్తుందని ట్వీట్‌ ‌చేసింది. అంటే ఆదమరిచి అబద్ధాలు చెబుతానని అమెరికా అధ్యక్షుడు విర్రవీగుతుంటే అతని రెక్కలు కట్‌ ‌చేస్తున్నది ఎవరు..? అమెజాన్‌ ఓనర్‌ ‌జెఫ్‌ ‌బెజోస్‌..‌ట్విట్టర్‌ ఓనర్స్ ‌జాక్‌ ‌డోర్సేయ్‌, ‌నోహ్‌ ‌గ్లాస్‌, ‌బిజ్‌ ‌స్టోన్‌, ఇవాన్‌ ‌విల్లియమ్స్..‌పరిస్థితి ఇలా ఉందని పాపం ట్రంప్‌ అం‌త వ్యతిరేకుల మధ్యలో చిక్కుకున్నాడని అనుకుంటే మళ్ళీ పప్పులో కాలు వేయటం ఖాయం.

ఎందుకంటే మనం పేస్‌ ‌బుక్‌ ఓనర్‌ ‌మార్క్ ‌జుకెర్బెర్గ్‌ను మర్చిపోకూడదు.  5 నవంబర్‌ ‌నాడు ఎన్నికల వాతావరణంలో ఫేక్‌ ‌న్యూస్‌ ‌పెరిగిందని పేస్‌ ‌బుక్‌ ‌ప్రకటించింది. అంతేకాదు పేస్‌ ‌బుక్‌, ఇన్‌స్టాలో వొచ్చే ఫేక్‌ ‌కంటెంట్‌ ‌నిలుపుదల చేస్తామని కూడా ప్రకటించింది. అయితే పేస్‌ ‌బుక్‌ ‌ట్విట్టర్‌ ‌తరహాలో మాత్రం ట్రంప్‌ అబద్ధాలకి చెక్‌ ‌పెట్టలేదు. ట్రంప్‌ అబద్ధాలు పేస్‌ ‌బుక్‌లో చలామణి అవుతూనే వుండినాయి. ఎక్స్‌పర్టస్ ‌ప్రకారం అబద్దాల అభివ్యక్తి స్వేచ్ఛకి అండగా పేస్‌ ‌బుక్‌ ‌నిలిచింది. ఫేస్‌ ‌బుక్‌లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న నిక్‌ ‌క్లిక్‌ ఈ ‌విషయాన్ని 2019 లోనే అంగీకరించారు. రాజకీయ నాయకులకి మేము మినహాయింపు ఇచ్చాం.. వారు మాటాడే కంటెంట్‌లో ఉన్న అబద్ధాలు వెలికి తీసే పని మేము చేయటం లేదని అధికారికంగా అంగీకరించారు. అయితే 2016 కేంబ్రిడ్జ్ అనలైటీకా ఎన్నికల తర్వాత అమెరికాలో విశ్రాంతి దరిమిలా కేవలం అమెరికా గడ్డలో ఎన్నికల మేరకు 2020లో ట్రంప్‌ అబద్దాలు అడ్డుకోవటం అనే కంటి తుడుపు చర్య చేపట్టింది. ఫేస్‌ ‌బుక్‌ ‌భారత రాజకీయాలలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నది మనకి తెలిసిన విషయమే. అంకి దాస్‌ ఎపిసోడ్‌ అం‌దరికీ గుర్తువుండే ఉంటుంది. మరి ఫేస్‌ ‌బుక్‌ అదే కంపెనీ టూల్‌ అయిన వాట్సాప్‌ ‌బీహార్‌లో ఏ మేరకు పనిచేసి ఉంటాయనేది మీ ఊహకే వదిలేస్తున్నా..

ప్రస్తుత అమెరికా ఎన్నికలలో ఏదైతే అబద్ధం గుట్టు రట్టవుతున్నదో ఇదంతా సాధారణ అమెరికా పౌరునికి మేలు తలపెట్టే పుణ్య కార్యం అనుకుంటే పొరపాటే అవుతుంది. ప్రస్తుతం ఈ విషయంలో ముందడుగుకు కారణం ఏమంటే అమెజాన్‌ ఓనర్‌ ‌జెఫ్‌ ‌బెజోస్‌కు..ట్విట్టర్‌ ఓనర్స్ ‌జాక్‌ ‌డోర్సేయ్‌, ‌నోహ్‌ ‌గ్లాస్‌, ‌బిజ్‌ ‌స్టోన్‌, ఇవాన్‌ ‌విల్లియమ్స్, ‌పేస్‌ ‌బుక్‌ ఓనర్‌ ‌మార్క్ ‌జుకెర్బెర్గ్‌లకు  ప్రస్తుతానికి కరడు కట్టిన రైట్‌ ‌వింగ్‌ ‌నాయకత్వం అవసరం లేదు. తమకి అనుకూలమైన పాలసీలు ఇంప్లిమెంట్‌ ‌చేయగల జో బైడెన్‌ ‌సరిపోతాడు. అందుకే అమెజాన్‌, ‌ట్విట్టర్‌, ‌ఫేస్‌ ‌బుక్‌ ఓనర్లు అమెరికాలో మాత్రమే ప్రస్తుతానికి ప్రజాస్వామ్య పరిరక్షణ పని చేపట్టారు. అందుకే మరే ఇతర దేశాల నాయకులు ఎన్ని అబద్ధాలను చెప్పినా ఈ విశ్వవ్యాపిత కంపెనీ ఓనర్లకి చీమ కుట్టినంత నొప్పి కూడా ఉండదు. కనుక మనం చుడాల్సింది అమెరికా అధ్యక్షుడు ఎవరు..లేదా బీహార్‌లో ఎవరు గెలిచారనేది కనే కాదు. ఎన్నికల తోలుబొమ్మలాట ఆడించే విశ్వవ్యాపిత కంపెనీల ఓనర్లు ఎంత బలవంతులు, వాళ్ళు రాజ్యాన్ని ఎలా కీలుబొమ్మలుగా ఆడిస్తున్నారనేది చుస్తే.. అప్పుడు మనం మన ప్రజాధికారాన్ని స్థాపించుకోగలుగుతాం.

aruna
అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ

Leave a Reply