Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు పక్షపాతిగా నిలిచింది : బీఆర్ఎస్ రాష్ట్ర వింగ్ యూత్ నాయకుడు ఆలేటి సంతోష్ రెడ్డి

జగదేవపూర్, ప్రజాతంత్ర, జూలై 18: బీఆర్ఎస్ కు ఎదురు లేదని, ప్రతిపక్షాలకు అధికారం రాదని బీఆర్ఎస్ రాష్ట్ర వింగ్ యూత్ నాయకుడు అలేటి సంతోష్ రెడ్డి అన్నారు. జగదేవపూర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సబ్బండ కులాలకు సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. రైతే రాజు లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతుబంధుతో రైతులకు పెట్టుబడి కష్టాలు తప్పాయని, రైతుబీమాతో రైతు కుటుంబాలకు బతుకుపై భరోసా పెరిగిందని వివరించారు. 24 గంటల కరెంట్ తో రైతులకు రాత్రి పూట కరెంట్ కష్టాలు, ప్రమాదాలు తప్పాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, భూగర్భజలాలు పెరిగి వరి సాగు పెరిగిందని చెప్పారు. గ్రామాల్లో రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు జై కొడుతుంటే ప్రతి పక్షాలు కరెంటు పై అబద్దాలను ప్రచారం చేయడం హస్యస్పదంగా ఉందన్నారు. అడలేక మద్దెల కోట్టినట్లు అబద్దాలకు తెరలేపుతున్నారని, రైతులే కాంగ్రెస్ నాయకులకు బుద్ది చెప్తారని ఆరోపించారు. మూడోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని, మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. బిసిలకు లక్ష సాయం, దళితులు ఆర్థికంగా ఎదగాలని దళితబంధు, పేదలకు గృహలక్ష్మి పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

Leave a Reply