Take a fresh look at your lifestyle.

నేటి స్టార్టప్‌లే రేపటి బహుళజాతి సంస్థలు

అంతర్జాతీయ స్థాయికి ఐఐఎం విద్యార్థులు ఎదగాలి
కొత్తరకం మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగాలి
ఒడిశాలో ఐఐఎం నూతన క్యాంపస్‌కు శంకుస్థాపనలో ప్రధాని నరేంద్రమోదీ

అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లుగా ఎదగాలని ఐఐఎం విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు. ప్రాదేశికం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడంద్వారా సత్తా చాటాలన్నారు. కొత్తరకం మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగాలన్నారు. ఒడిశాలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మేనేజ్‌మెంట్‌ ఐఐఎం ‌నూతన క్యాంపస్‌కు వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రధాని నరేంద్రమోదీ శనివారం శంకుస్థాపన చేశారు. మనదేశంలో 20ఐఐఎంలు ఉన్నాయి. ఇంతటి విజ్ఞాన భాండాగారం ఆత్మనిర్భర, స్వావలంబన భారత్‌కు సహాయపడాలని మోదీ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల అభివృద్ధి దేశంలో జరగాలని నొక్కి చెప్పిన మోదీ, ఐఐఎం విద్యార్థులు బ్రాండ్‌ ఇం‌డియాపై దృష్టి నిలపాలని కోరారు. దేశంలోని నిమ్న వర్గాల కోసం పాటుపడాలని అన్నారు. ఈ దశాబ్దం భారత్‌లో కొత్త బహుళజాతి సంస్థల అభివృద్ధికి కేటాయిస్తున్నాం. స్టార్టప్‌లు ప్రధాన పట్టణాల్లో మరింత వృద్ధి చెందుతున్నాయి.

ఈ స్టార్టప్‌లకు సమర్థ వంతులైన నిర్వాహకులు అవసరం. బ్రాండ్‌ ఇం‌డియా కోసం మనం కష్టపడాలని ఇది మన బాధ్యతగా గుర్తించాలన్నారు.  ఈ సంస్థలో విద్యనభ్యసించే వారు సమగ్రమైన అభివృద్ధి వైపు దృష్టినిలపాలని మోదీ పేర్కొన్నారు. దేశంలోని టయర్‌-2, ‌టయర్‌-3 ‌నగరాల్లో ఎన్నో నూతన స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయని ప్రధాని తెలిపారు. వ్యవసాయ రంగం మొదలు అంతరిక్ష రంగం వరకు అన్ని రంగాల్లో నూతన స్టార్టప్‌ల ఏర్పాటుకు రోజురోజుకు అవకాశాలు పెరుగు తున్నాయని చెప్పారు. 2014లో దేశంలో కేవలం 13 ఐఐఎంలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఐఐఎంల సంఖ్య మొత్తం 20కి చేరిందని పేర్కొన్నారు. ఇలాంటి విద్యాసంస్థల నుంచి చ్చే ప్రతిభా సమూహం ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌ప్రచారం మరింత బలోపేతానికి తోడ్పడుతుందని ప్రధాని చెప్పారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌, ‌కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ ‌పోఖ్రియాల్‌ ‌తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌ ‌మాట్లాడుతూ..రాష్ట్రంలో వేగవంతమైన పరివర్తనకు విద్య దోహదపడిందన్నారు. ఒడిశా రాష్ట్రం తూర్పు భారతదేశంలో ఎడ్యుకేషన్‌ ‌హబ్‌గా మారడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

Leave a Reply