- 120 మున్సిపాలిటీల్లో, 9 కార్పొరేషన్‌ల్లో
- నేడు పోలింగ్ సాక్ష్యం ఉంటే గెలిచినా అనర్హత వేటు
- టెండర్ వోటు అడిగితే అక్కడ పోలింగ్‌రద్దు
120 మునిసిపాలిటీల్లో, 9 కార్పొరేషన్‌లలో నేడు ఎన్నికలు జరుగనున్నాయి, బుధవారం జరిగే ఎన్నికలకోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికల సిబ్బంది పోలీంగ్‌స్టేషన్‌లకు ఈ సాయంత్రమే చేరుకుంటున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నాగిరెడ్డి స్పష్టంచేశారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. సాక్ష్యాలుంటే గెలిచినా అనర్హతవేటు తప్పదని హెచ్చరించారు. టెండర్‌ఓటు గురించి అడిగితే •ంబంధిత పోలింగ్‌కేంద్రంలో పోలింగ్‌రద్దు చేస్తామని ప్రకటించారు. ప్రతీ ఓటరు తన ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పట్టణాలలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంలేదనే ఫిర్యాదులు చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల అధికారి మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో జరుగుతున్న ఎన్నికల కోసం చేసిన ఏర్పాట్లను వివరించారు. 2647 వార్డుల్లో నేడు ఎన్నికలు జరుగనున్నాయని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో సగటున 800 మంది ఓటర్లు ఉంటారని, ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నందున ఎక్కువ సేపు క్యూలైన్లలో నిలువాల్సిన అవసరం కూడా ఉండదని పేర్కొన్నారు. ఓటింగ్ ప్రశాతంగా, వేగంగా జరగడానికి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు.బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరుగుతున్నందున పోలింగ్‌స్టేషన్‌లలో వెలుతురు కావాల్సినంత ఉండేవిధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో పోలీసుబంద్‌బస్తు పెంచామని చెప్పారు. 45వేల మంది ఎన్నికల సిబ్బంది, సంబంధిత రిటర్నింగ్ అధికారుల నుంచి ఎన్నికల సామాగ్రి తీసుకొని తమకు కేటాయంచిన పోలింగ్‌కేంద్రాలకు చేరుకుంటున్నారని, జిల్లా రిటర్నింగ్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని తెలిపారు.రామగుండం, బడంగ్‌పేట్, మీర్‌పేట్, బోడుప్పల్, బండ్లగూడాజాగీర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడా, జవహర్‌నగర్, నిజాంపేట్, నిజామాబాద్ కార్పొరేషన్‌లలో ఎన్నికలు జరుగనున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్‌కు 25న ఎన్నికలు జరుగనున్నాయని చెప్పారుఎన్నికలు జరుగుతున్న 1112 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు ఉంటారని తెలిపారు. .25వేల పోలీస్‌సిబ్బందితో బంద్‌బస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు.అన్నీ పోలింగ్‌స్టేషన్‌లలో మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేశామని, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగింకునేందుకు వీలుగా చక్రాలకుర్చీలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.9 కార్పొరేషన్‌లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.కార్పొరేషన్‌లలో 13లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. కొంపల్లి మునిసిపాలిటీలోని 10 పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేస్‌రికగ్నేషన్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నట్లుట చెప్పారు.ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో నేడు సెలవు ప్రకటించినట్లు చెప్పారు.115 వరకు సమస్యాత్మక ప్రాంతాలుంటాయని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘావిభాగం నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటుందని చెప్పారు.
ప్రలోభాలకు గురిచేసినట్లు సాక్ష్యం ఉంటే…..
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు సాక్ష్యం ఉన్నట్లయితే వెంటనే కేసుపెడతామని ఎన్నికల ప్రధానాధికారి హెచ్చరించారు.ప్రతీ ఓటరునిఘా పెట్టవచ్చునని, ఓటుకోసం డబ్బులు ఇస్తున్నట్లుగా సెల్‌ఫోన్ ఫోటో ఉన్నా, గట్టి సాక్ష్యమే అవుతుందని చెప్పారు.అభ్యర్థి గెలిచినా, డిస్‌క్వాలిఫై చేయడానికి ఎన్నికల సంఘానికి అధిక•రాలు ఉంటాయని చెప్పారు. ప్రతీ రిటర్నింగ్ అధికారి దగ్గర పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉన్నాయని, పోటీలోని అభ్యర్థులు వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి ఓటరుకు హక్కులున్నాయని చెప్పారు.ఎన్నికల వ్యయానికి సంబంధించి పకడ్బందీగా నివేదికలు ఎన్నికల సంఘానికి అందచేయాల్సి ఉంటుందని తెలిపారు.ప్రతీ వార్డులో కేవలం పది లేదా ఇరవై ఓట్లు మాత్రమే గెలుపు ఓటములను నిర్ణయించే అవకాశాలు ఉంటాయని, అందుకని ప్రతీ ఓటు చాలా విలువైనదని గుర్తు చేశారు.అందుకని డబ్బుమార్పిడికి సంబంధించి కానీ, ఎన్నికల వ్యయానికి సంబంధించి కానీ గట్టి సాక్ష్యం ఉన్నట్లయితే ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి హెచ్చరించారు.స్థానిక సాక్ష్యానికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.
టెండర్ వోటు …….
ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఒక ఓటరు తన ఓటును ఇతరులు వేశారని, తన ఓటు హక్కును వినియోగించుకుంటానని టెండర్‌ఓటుకోసం ప్రశ్నించినట్లయితే ఆ పోలింగ్‌కేంద్రంలో ఎన్నిక రద్దవుతుందని హెచ్చరించారు. ఒక్కో వార్డులో సరాసరి 1500 ఓట్లు మాత్రమే ఉన్నందున అభ్యర్థులు ప్రతీ ఓటును జాగ్రత్తగా గమనిస్తుంటారని పేర్కొన్నారు. 2355 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఓటింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షించేందుకు మైక్రో అబ్జర్వర్లు కూడా ఉన్నారని, ఎక్కడ సమస్య ఉన్నా, సంబంధిత అధికారులను వారు అప్రమత్తం చేస్తారని తెలిపారు.ఎన్నికల ప్రక్రియ ప్రారంభం, ప్రక్రియ ముగింపు, బ్యాలెట్‌బాక్స్‌లు స్ట్రాంగ్ రూంలకు చేర్చే వరకు రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారని వివరించారు.