Take a fresh look at your lifestyle.

ఉప్పెనల కదలిన గులాబీ దండు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: వేలాది మంది గులాబీ దండు వెంట రాగా తల్లి, అక్కచెల్లెళ్ల ఆశీస్సులు తీసుకుని రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భారీ ర్యాలీతో పటాన్ చెరు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి నామినేషన్ల ప్రక్రియ సాగింది. మొదటగా పటాన్ చెరు పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయం చైతన్య బస్తి హనుమాన్ దేవాలయాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జీఎంఆర్ దంపతులు, అనంతరం స్వగృహంలో తల్లి మణెమ్మ, అక్క చెల్లెలు, మనుమరాళ్ళ ఆశీస్సులు తీసుకుని సర్వమత ప్రార్ధనలో పాల్గొన్నారు. తదనంతరం రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయంని దర్శించుకుని నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల ఆశీర్వచనం తీసుకుని ర్యాలీనీ ప్రారంభించారు. శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి భారీ ర్యాలీతో ప్రచార రథంపై బయలుదేరి, లగ్డారం, ఇస్నాపూర్, ముత్తంగి మీదుగా పటాన్ చెరు వరకు వేలాది మంది గులాబీ సైనికులతో పటాన్ చెరుకు తరలివచ్చారు. అనంతరం రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉదయం 11 గంటలకు పటాన్ చెరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దివిజ సమక్షంలో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వీరితోపాటు ఎమ్మెల్యే జీఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి సైతం మొదటి సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషిలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply