Take a fresh look at your lifestyle.

అధ్యాపకులపై చర్యలుతీసుకొనే ఆతృత కళాశాలలపైన ఎందుకు లేదు?

fake salary,jnuh,santosh kumar,himatnagar,telanganaనకిలీ జీతాలపై జేఎన్టీయూహెచ్‌ ‌కు ఫిర్యాదు: టీఎస్‌ ‌టీసీఇఏ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌ ‌కుమార్‌•హిమాయత్‌ ‌నగర్‌, ‌జనవరి 17 (ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న టెక్నికల్‌ ‌కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలు, అర్హత విషయంలో జేఎన్టీయూహెచ్‌, ఏఐసిటీఈ విడుదల చేసిన హ్యాండ్‌ ‌బుక్‌ ‌లో తెలియజేస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అకడమిక్‌ ‌విషయంలో కొంత మేర మేలు చేస్తున్నప్పటికీ అధ్యాపకుల విషయంలో అధ్యాపకులు అందాల్సిన జీతాల విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ స్కూల్స్, ‌టెక్నికల్‌ ‌కాలేజెస్‌ ఎం‌ప్లాయిస్‌ అసోసియేషన్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు ఏ. సంతోష్‌ ‌కుమార్‌ ‌శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఉద్యోగులు ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని, జేఎన్టీయూహెచ్‌ అధ్యాపకుల దృవపత్రాల విషయంలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారన్నారు.

అధ్యాపకుల ధ్రువపత్రాలు తప్పిదాలు ఉంటే గత సంవత్సరం ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు జాప్యం చేశారని ప్రశ్నించారు. వాటిపైన ఎందుకు చర్య తీసుకోలేదు అనే అపోహ ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు. ఈ విషయంలో జేఎన్టీయూహెచ్‌ ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు. జెఎన్టియూహెచ్‌ ‌ప్రతిసారి 200-320 మంది పీహెచ్డీలు చేసిన వారిని పిలిపించి వారి పత్రాలను హొపరిశీలించడం జరుగుతుందని, అధ్యాపకులపై చర్యలు తీసుకోనే అతృత కళాశాలల యాజమాన్యాల పైన ఎందుకు లేదు అనే అపోహ చాలామందిలో ఉందన్నారు. నకిలీ పీహెచ్డి పత్రాలపైన ఏవిధంగానైతే చర్యలు తీసుకుంటుందో అదే విధంగా నకిలీ కళాశాలల పైన, నకిలీ జీతాల కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రిజిస్టర్‌ ‌కు వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. దానిపై జేఎన్టీయూహెచ్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

Tags: fake salary,jnuh,santosh kumar,himatnagar,telangana

Leave a Reply