Take a fresh look at your lifestyle.

దళిత కుటుంబాలల్లో వెలుగులు నింపుతున్న దళిత బంధు

దళితులకు నిజమైన ఆత్మ బంధువు సీఎం కెసిఆర్‌ అని నిరూపించే పథకాల్లో విశిష్టమైన, విశేషమైన పథకం దళిత బంధు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న పథకం. అంబేద్కర్‌ ‌తర్వాత సీఎం కెసిఆర్‌ ‌గారే దేశంలో దళితుల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనడానికి దళిత బంధు నిదర్శనం. దళితుల స్వావలంబన, సమగ్ర అభ్యున్నతి లక్ష్యంగా దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.

దళితుల బాగు కోసం దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేని విధంగా దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. దళితుల్లో ఆర్థిక సాధికారతయే లక్ష్యంగా దళిత బంధు పథకాన్ని సిఎం కెసిఆర్‌ ‌ప్రవేశపెట్టారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసిఆర్‌ ‌గారికే దక్కుతుంది. మూడేళ్లలో రాష్ట్రంలోని దళితులందరికీ లబ్ది చేకూరేలా మూడు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేయాలన్నది సిఎం సంకల్పం. ఇందు కోసం రాష్ట్రంలోని 17 లక్షల దళిత కుటుంబాలకు 1.70 లక్షల కోట్లు కేటాయింపునకు సీఎం సిద్ధంగా ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో దళిత బంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 17 వేల 700 కోట్ల రూపాయలు కేటాయించింది.

మొదటి విడతగా ఎంపిక చేసిన గ్రామాల్లో 118 నియోజకవర్గాలకు 100 కుటుంబాల చొప్పున దళిత బంధు ఇస్తున్నారు.

నిజానికి దళిత బంధు పథకం ఆగస్టు 16, 2021ననే హుజూరాబాద్‌ ‌లో ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఈ పథకం పకడ్బందీ అమలు క్సోం కొంత సమయం తీసుకున్నారు. ఈ పథకం పర్యవేక్షణకు సీఎం కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యదర్శిని నియమించారు. ఎవరి, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండానే నేరుగా లబ్దిదారుని అకౌంట్లోకే డబ్బులు పడే అద్భుత పథకం దళిత బంధు.

image.png

దళిత బంధు లక్ష్యం

రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబాన్ని ఆదుకోవడం. దళిత కుటుంబాల ఆదాయాన్ని పెంచడం తద్వారా దళితుల్లో తాము ఎవరికంటే తక్కువ కామనే ఆత్మవిశ్వాసాన్ని పెంచడం. సమాజంలో దళితుల ఆత్మగౌరవాన్ని పెంచడం. సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించడమే దళిత బందు లక్ష్యం.

దళిత బంధు విశిష్టతలు

కుటుంబం ఒక యూనిట్‌ ‌గా ప్రతి ఎస్సీ కుటుంబానికి పూర్తి సబ్సిడీతో రూ. 10 లక్షలను బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా నిధి మొత్తం ఒకేసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం నేరుగా జమ చేస్తున్నది. లబ్ధిదారుల నైపుణ్యం, అనుభవం, తమకు ఆసక్తివున్న యూనిట్‌ ‌ను ఎంపిక జేసుకునే వెసులు బాటు లబ్దిదారులకు కల్పించడం జరిగింది.

- Advertisement -

దళిత బందు అమలు కోసం సిఎంఓలో ప్రత్యేక ఐఎఎస్‌ అధికారి:-

దళిత బంధు పర్యవేక్షణకు గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దళిత బంధు కమిటీల ఏర్పాటు.

పైలెట్‌ ‌ప్రాజెక్టుగా:-

హుజూరాబాద్‌ ‌లో దళిత బంధు ప్రారంభమైంది. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలెట్‌ ‌ప్రాజెక్టుగా చేపట్టారు. ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా చారకొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌.

‌నేడు రాష్ట్రంలోని 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు అవుతున్నది. 2021-22 సంవత్సరంలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరు నిధులు:-

2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,441 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటి వరకు 40 వేల మంది లబ్ధిదారులకు 4 వేల కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది . 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష 75 వేల కుంబుంబాలకు రూ. 17,700 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని దళిత బంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్నది. లబ్ధిదారులతో దళిత బంధు రక్షణ నిధి ఏర్పాటు చేసి అనుకోని ఆపదల నుండి లబ్దిదారుల కుటుంబాలని కాపాడెందుకు దళిత రక్షణ నిధి ఏర్పాపు చేయబడింది. రూ.10వేల లబ్ధిదారుడి వాటాకు అంతే మొత్తం ప్రభుత్వ వాటాతో కలిపి దళిత బంధు రక్షణ నిధి ఏర్పాటు చేయబడింది. లబ్ధిదారులు వ్యాపారంలో ఎదుర్కొనే తీవ్ర సమస్యల నుంచి ఆదుకోవడంకూడా ఈ నిధి విధి. దళిత బంధుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ లైసెన్స్‌ల ద్వారా ఏర్పాటు చేయు ఫెర్టిలైజర్‌, ‌మెడికల్‌, ‌మద్యం దుకాణాలు తదిత లాభాదాయక వ్యాపారాలలో దళితులకు 10 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దళితుల సంక్షేమంలో దళిత బంధు అమలు ఒక సువర్ణ అధ్యయనంగా పేర్కొనవచ్చును. దళితుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి సరికొత్త బాటలు వేసే దళిత బంధును లభ్ధిదారులు పూర్తిగా సద్వినియోగపర్చుకున్నప్పుడే ప్రభుత్వ ఆశయానికి సార్థకత చేకూరుతుంది.

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు దూరదృష్టితో రూపొందించిన దళితబందు ఫలితాలు రాష్ట్రంలో అప్పుడే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం దళిత బందు కింద ఇచ్చిన రూ.10 లక్షలకు తమ నైపుణ్యాన్ని జోడు చేసి ఆత్మగౌరవంతో దళితులు ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు.

– కమిషనర్‌, ‌సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్‌ ‌వారిచే జారీ చేయనైనది.

Leave a Reply