Take a fresh look at your lifestyle.

కంటైన్మెంట్‌ ‌ప్రాంతాల్లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌

  • ఇళ్లనుంచి ఎవరూ బయటకు రాకుండా కట్టడి
  • అత్యవసరం అయితే ఇంటికే మందులు, కూరగాయాలు సరఫరా

హైదరాబాద్‌ ‌జంటనగరాలు కరోనా రెడ్‌ ‌జోన్‌ ‌ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ‌కఠినంగా అమలు చేస్తున్నారు. అదేపనిగా వీధుల్లోకి వస్తున్న ప్రజలను పోలీసులు నిలదీస్తున్నారు. కంచె దాటి బయటకు వెళ్లకుండా 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. ఇళ్ల వద్దకే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.. అన్ని ఇళ్లలోని వారికి ఫోన్‌ ‌నంబర్లను అందుబాటులో ఉంచి.. ఏ అవసరం ఉన్నా క్షణాల్లో స్పందిస్తున్నారు.. సిబ్బంది మాస్కులు, గ్లౌజులు ధరించి ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు.. గతంలో పాజిటివ్‌ ‌వచ్చిన వారి బంధువులు, సన్నిహితుల వివరాలను సేకరిస్తున్నారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పీపీఈ కిట్లు ధరించి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సోడియం క్లోరైడ్‌ ‌ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఈజోన్లను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా కంటైన్మెంట్‌ ‌జోన్లలో పోలీస్‌ ‌ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఆ ప్రాంతాలకు రాకపోకలను నిషేధించి కాలనీలకు వెళ్లే రహదారులను మూసేశారు. కంటైన్మెంట్‌ ‌జోన్‌ ‌నుంచి బయటకు రావాలన్నా.. బయట నుంచి లోపలకు వెళ్లాలన్నా కుదరడం లేదు. ఆ ప్రాంతానికి వెళ్లే అన్ని దారులు మూసివేయడంతో పాటు ప్రతి కదలికను పోలీసులు గమనిస్తున్నారు. మరోవైపు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా అత్యవసరం అయితే సంబంధిత అధికారులకు ఫోన్‌ ‌చేయాలని, నిత్యావసరాలు కావాలన్నా ఇళ్ల వద్దకే సరఫరా చేస్తామన్నారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తుండగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వారికి సహకరిస్తున్నారు. సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి గతంలో పాజిటివ్‌ ‌నిర్దారణ అయిన వారితో క్లోజ్‌ ‌కాంటాక్ట్ ‌వివరాలు సేకరిస్తున్నారు. 24 గంటల పాటు ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.

గతంలో కుత్బుల్లాపూర్‌ ‌నియోజకవర్గంలో 2,3 మాత్రమే పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 15కు చేరింది.చంద్రగిరినగర్‌లో 5, సుభాష్‌నగర్‌లో 1, ఎస్‌ఆర్‌ ‌నాయక్‌నగర్‌లో 1, అపురూప కాలనీలో 1, ప్రగతినగర్‌లో 2 కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ‌సభకు వెళ్లిన సుభాష్‌నగర్‌కు చెందిన వ్యక్తితో క్లోజడ్‌ ‌కాంటాక్ట్ ఉన్న కళావతినగర్‌కు చెందిన ఓ వ్యక్తికి సైతం వైరస్‌ ‌సోకింది. అతన్ని ఐసోలేషన్‌ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు పరిక్షలు నిర్వహించగా నలుగురికి సైతం పాజిటీవ్‌గా తేలడంతో వారిని సైతం గాంధీ ఆస్పత్రికి తరలించారు.ఇదిలా ఉండగా ఆయా ప్రాంతాల్లో పాజిటీవ్‌ ‌వచ్చిన వారితో పాటు కుటుంబ సభ్యులు, చుట్టు ప్రక్కల వారిని పరిక్షించే సమయంలో వైద్య సిబ్బంది వద్ద కనీసం పిపిఈ కిట్లు, ఎన్‌-95 ‌మాస్కులు కూడా అందుబాటులో లేవు. కేవలం సాధారణ మార్కులతోనే వైద్యాధికారులు పని చేస్తున్నారు. బృందాలుగా విడిపోయి ఇంటింటి సర్వే చేస్తు వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వారిని 108లో గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. దాదాపుగా 8000 వేల గృహాలను సర్వే చేశారు. పాజిటీవ్‌ ‌కేసులు నమోదైన ప్రాంతాల్లో చుట్టూ ఉన్న వంద ఇళ్లను కట్టడి చేసి రాకపోకలను నిషేదించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!