Take a fresh look at your lifestyle.

అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి : సుపరిపాలనకు పర్యాయపదం..

‘‘‌పది పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో కొనసాగారు. వారు సుపరిపాలన సూక్ష్మ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూనే
ఉండేవారు. ప్రతిపక్ష సభ్యునిగా వారిహేతుబద్ధ వాదన, నిర్మాణాత్మక విమర్శలు సంక్షేమ-కేంద్రీకృత పాలనా వ్యవస్థ అమలుకోసం విషయ గంభీరతను కలిగి ఉండేది. ఆయన ప్రధానమంత్రిగా తన  హయాంలో చేపట్టిన కేంద్రీకృత కార్యక్రమాలు భారతదేశ పరివర్తనా ప్రయాణంలో మైలురాళ్లుగా నిలిచాయి.’’

సుపరిపాలన లేదా సుశాసన్‌ ‌భారతదేశ ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాల వారసత్వం. ఆధునిక భారతం బౌద్ధమతానికి చెందిన గణ సంఘాల ప్రజాస్వామ్య విలువలు, క్రీ.శ.11వ శతాబ్దపు  బసవేశ్వరుడు  స్థాపించిన అనుభవ మంటప వ్యవస్థ, చాణుక్యుని అర్థశాస్త్రం, సింధూ లోయ నాగరికతలో పుర ప్రణాళికలు, మౌర్య చక్రవర్తి అశోకుడి వారసత్వం వంటి పునాదులపై మనదెస భవిత పరిపుష్టంగా ఉంది. అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని జరుపుకునే  సుపరిపాలన దినోత్సవ సందర్భంగా, స్వతంత్ర భారతదేశ పాలనాచర్యలను తన దార్శనికతతో సంస్థాగతీకరించడంలో  వాజపేయి నిర్వహించిన విశిష్ట పాత్రను వెలుగులోకి తీసుకురావడం సందర్భోచితం, అత్యవసరం.స్వాతంత్య్రానంతర కాలంలో  ‘‘సుపరిపాలన’’ పాలనా సంస్కరణలకు కేంద్ర బిందువుగా ఉపన్యాసాలకే పరిమితమైంది  కానీ చట్టసభల చర్చలలో  ప్రణాళికా సంఘం వంటి సంస్థలలో రాజ్యాంగబద్ధంగా జరిపిన విధాన చర్చలలోనూఅమలుకు నోచుకోని  పేలవమైన చర్యలతో  సంస్కరణలు కాగితంపైనే మిగిలిపోయాయి. అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి దార్శనిక నాయకత్వం, రాజనీతిజ్ఞతతో  ప్రజల జీవితాలకు సంస్కరణల ఫలితాల్ని అందించిన  చారిత్రాత్మక సుపరిపాలనా ప్రయత్నాలను దేశం గమనించింది.

పది పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో కొనసాగారు. వారు సుపరిపాలన సూక్ష్మ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూనే ఉండేవారు. ప్రతిపక్ష సభ్యునిగా వారిహేతుబద్ధ వాదన, నిర్మాణాత్మక విమర్శలు సంక్షేమ-కేంద్రీకృత పాలనా వ్యవస్థ అమలుకోసం విషయ గంభీరతను కలిగి ఉండేది. ఆయన ప్రధానమంత్రిగా తన  హయాంలో చేపట్టిన కేంద్రీకృత కార్యక్రమాలు భారతదేశ పరివర్తనా ప్రయాణంలో మైలురాళ్లుగా నిలిచాయి. రైతుల అభివృద్ధి, కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డ్‌ల ప్రవేశం,  ప్రధాన మంత్రి గ్రామ్‌ ‌సడక్‌ ‌యోజన, స్వర్ణ చతుర్భుజ పథకం ద్వారా మౌలిక సదుపాయాలను పెంచడం, నదుల అనుసంధానం, జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలు,  సర్వశిక్షా అభియాన్‌ ‌ద్వారా విద్యా సంస్కరణలు, ప్రత్యేక గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం, విద్యుత్‌ ‌నియంత్రణ విధానాలను  మెరుగుపరచడానికి, విద్యుత్‌ ‌రంగంలో పురాతన విద్యుత్‌ ‌చట్టాన్ని సవరించి కేంద్రీయ విద్యుత్‌ ‌నియంత్రణ కమీషన్‌ ఏర్పాటు వంటివి  సమాజంలోని ప్రతి విభాగాన్ని తాకిన కొన్ని చర్యలు.

వాజపేయ్‌  ‌జాతీయ పాలనా ప్రధాన్యాల్లో భాగంగా మే 1998లో, పోఖ్రాన్‌ ‌రాజస్థాన్‌లో అణు పరీక్షలు నిర్వహించి, భారతదేశాన్ని అణ్వాయుధ సహిత దేశంగా మార్చారు. సంక్లిష్టమైన కాశ్మీర్‌ ‌సమస్యను పరిష్కరించడంలో కాశ్మీరీ ప్రజల మానవత్వం, శాంతి, పవిత్రతల కోసం ఉద్దేశించిన ప్రసిద్ధ వాజ్‌పేయి సిద్ధాంతం ‘ఇన్సానియత్‌, ‌జమ్‌హూరియత్‌  ‌కాశ్మీరియత్‌’ ‌వారి దార్శనికతను  ప్రతిధ్వనింపజేసింది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి –    ‘మీరు స్నేహితులను ఎంచుకోవచ్చు, పొరుగువారిని కాదు’ అన్న వారి మాటలు అనేక వేదికల మీద పునరావృతమైన వ్యాఖ్యా నాలయ్యాయి. అటల్‌జీ ప్రభుత్వం అమరవీరుల మృతదేహాలను వారి ఇళ్లకు తీసుకురావడానికి అనుమతినిచ్చింది. దేశ సేవలో నిరుపమాన  త్యాగాలు  చేసిన సైనికులకు  ప్రజలు గౌరవవం దనాలు సమర్పించడానికి ఇలా  వీలు కల్పించారు. వారి చర్యలు పలు సందర్భాలలో  ఏకాభిప్రాయం పొందగలిగేవి. ఆయన గొప్ప వ్యవహారకర్త, 2000లో మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ‌బీహార్‌ ‌ల నుండి ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, ‌జార్ఖండ్‌ ‌గా మూడు కొత్త రాష్ట్రాలు  శాంతియుత పద్ధతిలో ఏర్పడ్డాయి. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం సుపరిపాలన స్థాపన దిశగా ఇది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం.

ఆయన డాక్టర్‌ ‌బీ.ఆర్‌. అం‌బేద్కర్‌ ఆలోచనలు, దేశ నిర్మాణంలో ఆయన పాత్ర, దార్శనికతలతోలోతుగా ప్రభావిత మయ్యారు. అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి, లాల్‌ ‌క్రిషన్‌ అద్వానీల సంకల్పంతో, బిజెపి మద్దతుతో అప్పటి వీపీ సింగ్‌ ‌ప్రభుత్వం మార్చి 31, 1990న డాక్టర్‌ ‌భీంరావ్‌ అం‌బేద్కర్‌ను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఢిల్లీలోని 26 అలీపూర్‌ ‌రోడ్‌లో వారు నివాసమున్న ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని వాజ్‌పేయి సంకల్పించారు. అది రాజస్థాన్‌లోని సిరోహి మహారాజు ఆహ్వానం మేరకు అంబేద్కర్‌ ‌గారు 1951లో  కేంద్ర మంత్రివర్గం  నుండి రాజీనామా చేసిన తర్వాత నివాసమున్న భవనం, సామాజిక సమానత్వం కోసం ప్రజలకు ప్రేరణగా ఆ మ్యూజియంను  రూపొ ందించారు. డాక్టర్‌ అం‌బేద్కర్‌ ఈ ‌ప్రదేశంలో జీవిత చరమాంకం వరకూ నివసించారు.పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్రైవేట్‌ ఆస్తి మార్పిడి దస్తావేజుపై అక్టోబర్‌ 14, 2003‌న సంతకం చేసింది, వాజ్‌పేయి పర్యవేక్షణలో మ్యూజియం అభివృద్ధి పనులు డిసెంబర్‌ 2003‌లో ప్రారంభమయ్యాయి. తరువాత యూపీఏ  ప్రభుత్వ  హయాంలో ఈ ప్రాజెక్ట్ ‌ను పక్కన పెట్టారు. మోదీ ప్రభుత్వం దీనిని 100 కోట్ల రూపాయలతో డాక్టర్‌ అం‌బేద్కర్‌ ‌జాతీయ స్మారక చిహ్నంగా అభివృద్ధి చేసి ఏప్రిల్‌ 13, 2018 ‌న జాతికి అంకితం చేసింది.

అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి 21వ శతాబ్దం ప్రారంభంలో అనేక కార్యక్రమాలను చేపట్టడం వల్ల సుపరిపాలన చర్చలో వారి కృషిని జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని  ముందుకు తీసుకెళ్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన లక్ష్యాలను సాధించడానికి, ఆధునిక భారతదేశాన్ని  21వ శతాబ్దపు ప్రపంచ దిక్సూచిగా మార్చడానికి ఈ చర్యల వేగాన్ని, స్థాయిని పెంచారు. నేరుగా లబ్దిదార్ల ఖాతాలోకి నగదు జమచేసే విధానమైన డీబీటీ జనధన్‌, అధార్‌ ‌మొబైల్‌ ‌ఫోన్ల అనుసంధానమైన ‘జేఏఎమ్‌’    ‌ట్రినిటీ, మానవ సంపర్కం లేకుండా పన్ను చెల్లింపులకై నిర్దేశించిన  ఫేస్‌లెస్‌ ‌టాక్సేషన్‌ ‌వంటి సాంకేతిక అంశాలు, ఇతర చర్యలతో పాటు, సులభతరం చేసి శ్రమ తగ్గించింది. ఇది సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేసింది. కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డుల పరిధి పెంచారు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను అందులో  చేర్చారు. భారతమాల, సాగర్‌మాల, జాతీయ ఆస్తుల నగదీకరణ పైప్‌లైన్‌, ‌వ్యవసాయ మౌలిక వసతుల నిధి, ప్రధానమంత్రి గ్రామ సడక్‌ ‌యోజన  ఫేజ్‌-III ‌కి పొడిగింపు వంటి పథకాల  ద్వారా మౌలిక సదుపాయాల రంగానికి పెద్ద ప్రోత్సాహం అందించారు.
జమ్మూ కాశ్మీర్‌ ‌ప్రత్యేక హోదాకై రూపొందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 ‌రద్దు వల్ల ఆ రాష్ట్ర యంత్రాంగానికి సమర్ద పాలనానిర్వాహణలో  కొత్త  బలాన్ని జోడించినట్లు అయ్యింది. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలను ప్రధాన స్రవంతి అభివృద్ధి ఎజెండాలోకి తీసుకువస్తున్నారు. ‘అటల్‌ ‌భుజల్‌ ‌యోజన’ స్థిరమైన భూగర్భ జల నిర్వహణ కోసం ఏర్పాటైన పథకం. ఇటీవల, డిసెంబర్‌ 8‌న కేంద్ర మంత్రివర్గం కెన్‌-‌బెట్వా అనుసంధాన  ప్రాజెక్ట్ ‌కు ఆమోదం తెలిపింది, అటల్‌జీ దార్శనికత నిదర్శనంగా  నీరు ఇబ్బడిముబ్బడిగా ఉన్న ప్రాంతాల నుండి మిగులుజలాలను  కరువు పీడిత,  నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించే మొదటి ప్రాజెక్ట్ ‌గా ఇది అవతరించింది

ప్రజల జీవితాన్ని సులభతరం చేసేందుకు  ‘కనీస ప్రభుత్వ జోక్యంతో గరిష్ట పాలన’ మంత్రంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వం  పీఎం గతిశక్తి, ప్రగతి, మిషన్‌ ‌కర్మయోగి ద్వారా సామర్థ్యం పెంపుదల వంటి కార్యక్రమాలు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య మెరుగైన సమన్వయంతో పాలనా ఇబ్బందులు  ఛేదించడం, విధానాలు సరళీకృతం చేయడం, వ్యాపారాలు, వ్యక్తులు ఇతర వాటాదారుల పై భారాన్ని తగ్గించడం పై దృష్టి సారించింది. పన్నుల విధానం, లేబర్‌ ‌కోడ్‌లు, దివాలా, దివాలా కోడ్‌, ‌కొత్త విద్యా విధానం, ముద్ర, ప్రధానమంత్రి ఆవాస్‌ ‌పథకాలు, పిఎం కిసాన్‌,  ‌పన్ను వివాదాల విషయంలో  అవరోధాలు  లేని పరిష్కారం వంటి అనేక ఇతర అంశాలు, సుపరిపాలన యొక్క పారదర్శకత, ప్రతిస్పందనలను బలోపేతం చేస్తాయి. ‘ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌’ ‌ర్యాంకింగ్‌లో భారతదేశం 2015లో 145 నుండి 2020లో 63కి 79 స్థానాలకు మెరుగుపడటం ఇటువంటి చర్యలకు నిదర్శనం. అదేవిధంగా, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇం‌డెక్స్ ‌ర్యాంకింగ్‌ 81‌వ స్థానం  (2015) నుంచి 46వ ర్యాంక్‌ (2021)‌కి పెరిగింది.
సమాజాలు శాస్త్రీయ, సాంకేతిక అభివృద్ధితో పరిణామం చెందుతాయి. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మార్పులకు అనుగుణంగా పాలనా సంస్కరణల ప్రక్షాళన అవసరం. సమ యానుకూలంగా అమలవుతున్న  మోదీ ప్రభుత్వ చర్యలు నిజంగా విశేషమైనవి ఇప్పటివరకు అనేక రకాలుగా లక్ష్యాలను సాధిస్తున్నాయి. ఎంత పురోగమనం చెందినా అభివృద్ధికి ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. అనేక ముఖ్యమైన సంస్కరణలు నిర్మాణాత్మక దశల్లో ఉన్నాయి. దేశ శ్రేయస్సు కోసం అనేక వేదికలపై ఏకకాల ఎన్నికలు, ఒకే వోటర్ల జాబితా, అఖిల భారత న్యాయ సేవల రూపంలో న్యాయ సంస్కరణల కోసం ప్రధాన మంత్రి గళమెత్తారు . సంస్కరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి సంబంధిత వర్గాల మధ్య సమాఖ్య రాజకీయ స్థాయిలలో తగిన సంప్రదింపులు జరుగుతున్నాయి.

సుపరిపాలన ప్రజలకు తప్పనిసరిగా సేవ చేయడానికి ఒక సాధనం,  స్థిరమైన రాజ్యాంగ వ్యవస్థలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి దీనివల్ల అవకాశం ఉంటుంది. అటల్‌జీ దార్శనికత, నాయకత్వం, మార్గదర్శకత్వం ప్రస్తుత, భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా  సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సంద ర్భంగా ఆత్మపరిశీలన చేసుకొని, నవ భారతదేశాన్ని నిర్మించడం కోసం ‘సబ్కా సాథ్‌, ‌సబ్‌కా వికాస్‌, ‌సబ్‌కా విశ్వాస్‌, ‌సబ్‌కా ప్రయాస్‌’ ‌స్ఫూర్తితో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.
– అర్జున్‌ ‌రామ్‌ ‌మేఘ్వాల్‌,
‌కేంద్ర సాంస్కృతిక, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, భారత ప్రభుత్వం, లోక్‌సభలో బికనీర్‌ ‌నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్‌ ‌సభ్యులు.

Leave a Reply