Take a fresh look at your lifestyle.

‘‘గీ కచ్చగట్టుడేంది’’!?…

“నడివంత్రపు సిరి మోపయితె నడకలు ఇచ్ఛంత్రం గుంటయంటరు.తెలంగాణ ఉద్దెమ ద్రోహులందర్ని సుట్టు బెట్టుకుంటిరి.నెత్తుటి త్యాగాలు జేషినోళ్ళమీద కచ్చపెట్టుకుంటిరి.గఢీల కేలి రాజ్జెం జేసుకుంట దోరీర్కం జూపుతాంటిరి.ఐదేండ్లకో పాలిచ్చేటి పీ.ఆర్సీని ఆగం జేయబడ్తిరి.అది ఆలిషెమైతె ఐ.ఆర్‌ ఇత్తరు, దానిజోలే లేకుంటాయే!యేట రొండు సార్లిచ్చేటి డి.ఏ.మూడు వాయిదాలింక లెక్కలే జూడకపోతిరి. బహ్మాండమైన పీ.ఆర్సీ ఇచ్చుకుందామన్నది మీరే! నౌకరి దిగే వయిసు పెంచుతమని ఏగిరం బెట్టింది మీరే! గిసొంటి ‘‘చింతమడక కతలు’’ పడుతె పడ్డరు గని,పంతుళ్ళ తోని పడుడు సరైంది కాదు గద!”

yelamandhaమొండివాడు రాజు కన్నా బలవంతుడంటరు,మరి రాజే మొండివాడయితె రాజ్జెం గిట్లుంటది! కోర్టులు, నాయం, అన్నీ సుట్టజుట్టి,సూరుగ్గట్టి ఒక్కలి నోటి మాటే కానూనైన కాడ రాజ్జెం గిట్లుంటది! రాజ్జాంగం,గీజ్జాంగాలు మాకు జాన్తా నై! అవి ప్రజలకోసం గని మాకెందుకనే పాలకులున్న కాడ రాజ్జెం గిట్లుంటది! బంగారు తెలంగాణంటె గఢీల పాలన, ఫామౌజుల పాలన కాదని యెరుకయ్యేటి కాలమెట్ల రావాలె!? యెప్పుడు రావాలె!? గురిగింజ కింద నలుపు పైకి పొక్కిలై ఎక్కిరిచ్చేటి కాలం తలెత్తుకుంటె తప్ప సర్కార్‌ ‌భూమి దిగెటట్టు కానత్తలేదు. ఉద్దెమకాలంల దారి జూపిన బుద్దిజీవులను సర్కార్‌  ‘‌బద్ది’లకు సుత రాకుంట జూడబట్టె! పంతుళ్ళ మీద కచ్చి గట్టి గోస బుచ్చుకోవట్టె!.ఆరేండ్లంల్ల తీరొక్కతిప్పలు బెట్టు కుంటనే సగం జీతాలు గోషే కాడికచ్చింది.కరోనా కతల జీతాల కోతలు ముగ్గురుపంతుళ్ళ పాణాలు తీషె!పద్దతి లబోయి కోర్టులనింకా నమ్ముతానం గనుక అటు మొగాన బోతే యేమున్నది!?

యేడేషిన గొంగలి గాడనే వున్నది.’’ఉద్దోగులకు సగం జీతం గోసుడేంది!?వాళ్ళను గంతగనం గోస పుచ్చుకునుడేంది!? ఛలో!లెక్కల్‌ ‌లావు’’!? అని కోర్టు గరం గరమయింది. తెల్లారితె కోర్ట్ ‌ముందు సర్కార్‌ ‌తలంచుకో వాలె!గిట్ల తలంచుకుంటే ‘‘బంగారు తెలంగాణె’’ ట్లయితది?‘కోర్ట్ ఇం‌తపన్కత్తాదాను’!అని సర్కార్‌ ‌తిప్పలు జూడలేక  రాత్రికి రాత్రే అధికారం షెక్రం తిప్పె!మబ్బుల్నే పురుడు పోసుకున్న ఆర్డినెన్స్ ‌ను సర్కార్‌ ‌షేతుల బెట్టింది.’’శెబ్బాష్‌!
‌గిదిరా!బయ్‌!‌ప్రెండ్లీ గవర్మెంటంటె!’’అని సర్కార్‌ అధికారుల్ని తారీఫ్‌ ‌జేషింది.చీకట్లె పుట్టిన ఆర్డినెన్స్ ‌షిత్రకతల ఇషాన్ని బొళ్ళున గక్కనేగక్కింది.కొట్లాడి కోరి తెచ్చుకున్న రాజ్యంల పంతుళ్ళకు,పింఛనోళ్ళకు, ఉద్దోగులందరికి విపత్తుల నివారణ చట్టం లెక్కన బరాబర్‌ ‌జీతాల కోతలుంటయి.గీ లెక్కలకు రాని టెంపరరీ నౌకరోళ్ళను సుత దీంట్లకు గుంజి సెలవులను తెగ్గోషే ముచ్చటముందేషె!ఆర్డినెన్స్ ‌తీసుడేందని కోర్టుల సవాల్‌ ‌జేషేటట్టు సుత లేకుంటున్నది.   ‘‘ఇకృతంగ పుట్టిన పోరడు ఇకారంగేడిషినట్టు’’!

కోర్టు మెట్లకాన్నే ఆన్నాయం చేతుల నాయం ఉన్నపళంగ జీవిడిషింది.ఆర్ధికంగ దివాలు దీషేటి ఆపతత్తె తప్ప ఉద్దోగులకు జీతభత్తాల కోతలుండయి!? పొయిన నెల సంది సర్కార్‌ ఆమ్దానచ్చేటియన్ని బరాబరే నడిషినంక జీతాల కోతలేందని కోర్ట్ ‌నిలేషింది!మందు అమ్మబట్టె! బస్సులు తిరుగబట్టె! రిజిష్ట్రేషన్లు కాబట్టె!ఆమ్దానికేడ తక్కువైందో జెప్పాలె! దేశం మొత్తంల ఏ రాష్ట్రంల లేని తిప్పలు మన బంగారు తెలంగాణల్నే యెట్లచ్చే!కరోనా బీమారి పేరుమీద గిట్ల ఆగం జేత్తె సగం జీతాలతోని పంతుల్లెట్ల బతుకుతరు!

చిట్టీలు గట్టుడుంటది,ఇంటి కిరాయి, తిండితిప్పలుంటయి, మందులుగోలీల కర్సుంటది!
ఇల్లంన్నంక యెన్నోవుంటయి.జీవితాంతం జేషిన నౌకరి పైసలతోని ఓ ఇల్లు సుత కట్టుకోలేని వైట్‌ ‌కాలర్‌ ‌గరీబ్‌ ‌బతుకు పంతుళ్లది.  పూర్తి జీతాలున్నప్పుడే సగం అప్పుల తిప్పలట్నే వుండేదాయె! సగం జీతాల కాలంల అప్పులోల్ల ఆగానికి తిప్పలెక్కువై ఆగం జేయకుంట వుంటయా!మూడునెల్లల్ల ముగ్గురు పంతుళ్ళు జీవిడిసుడుకు ఎవలు బాధ్యులనుకోవాలె!? వాళ్ళుసురు ఎవలికి తగులుతదో! యేందో! అందరు బాగుండాలె!అండ్ల మనం సుత వుండాలనుకోవాలె!  పంతుళ్ళ మీద గింతగనం కచ్చకడితిరి!.

సంఘాలంటే ఓర్వలేకపోతాంటిరి.గీ సంఘాలే గదా అప్పటి ఉద్దెమాననెత్తురు పారిచ్చి రాష్ట్రం తెచ్చేకాడ సబ్బండ.వర్ణాల్ని నడిపిచ్చిముందున్నరని మరువద్దు.జనం ఓట్లేషి గెలిపిస్తె  మీకు సర్కార్‌ ‌నడిపేటి నౌకరచ్చింది.మీ నౌకరి కాలం ఐదేండ్లే!పంతుళ్ళ నౌకరికాలం మీకన్న పదింతలెక్కువన్న సోయుండాలె!ఉద్దెమంల త్యాగాలు జేషినోళ్ళకు సర్కార్‌ ‌ను నిలేషేటి హక్కుంటది.తప్పుదారి బట్టకుంట జూషేటి హక్కుంటది!. నడివంత్రపు సిరి మోపయితె నడకలు ఇచ్ఛంత్రం గుంటయంటరు.తెలంగాణ ఉద్దెమ ద్రోహులందర్ని సుట్టు బెట్టుకుంటిరి.నెత్తుటి త్యాగాలు జేషినోళ్ళమీద కచ్చపెట్టుకుంటిరి.గఢీల కేలి రాజ్జెం జేసుకుంట దోరీర్కం జూపుతాంటిరి.ఐదేండ్లకో పాలిచ్చేటి పీ.ఆర్సీని ఆగం జేయబడ్తిరి.అది ఆలిషెమైతె ఐ.ఆర్‌ ఇత్తరు, దానిజోలే లేకుంటాయే!యేట రొండు సార్లిచ్చేటి డి.ఏ.మూడు వాయిదాలింక లెక్కలే జూడకపోతిరి. బహ్మాండమైన పీ.ఆర్సీ ఇచ్చుకుందామన్నది మీరే! నౌకరి దిగే వయిసు పెంచుతమని ఏగిరం బెట్టింది మీరే! గిసొంటి ‘‘చింతమడక కతలు’’ పడుతె పడ్డరు గని,పంతుళ్ళ తోని పడుడు సరైంది కాదు గద!
కొరోనా ఫండ్‌ ‌కింద కోట్లరూపాలచ్చె!.ఆర్భీఐ బేంకోళ్ళిచ్చె! పెట్టిన కర్సులస్సలు కాన్రావాయె!వచ్చిన ముళ్ళిప్పిన కతే లేనట్టుండె!కరోనా దావకాన్ల లచ్చమంచాలు యేయించినమంటిరి, టెస్టింగ్‌ ‌లే జేయకపోతిరి,గచ్చీబౌలిల టిమ్స్ ‌కొత్త దావకానంటిరి,అండ్ల సెక్కురీటోళ్ళు,వాళ్ళెంబటో కుక్క తప్ప చీమ సుత లేదని ఎరుకాయె! కరోనా దందాల సర్కార్‌ ‌కు మాగనే కలిషచ్చిందని అనుకోబట్టె! వేల కోట్ల రూపాలు జేరే కాడికి జేరినయని అందరనబట్టె!

కలిషచ్చిన కరోనా కాలం లెక్కలేమన్న అడగబడితిరా!అరలచ్చ కన్న యెక్కువున్న బళ్ళను ఆరేండ్లల్ల పిడాత బొందబెట్టి పిడికెడుబళ్ళు జేషిండ్లు.కొత్త నౌకర్లే లేకపాయె!ఉన్న సర్కార్‌ ‌సదువులను,పంతుళ్ళ నౌకర్లను మాయం జేషేందుకు కరోనా మాగనే కలిషచ్చింది    ఖదరుగ బతికేటి పంతులు నౌకర్ని బిచ్చపు బతుకులు గ మార్చిండ్లు.సొంత రాష్ట్రం కోసం ముందుండి రణం జేషినోళ్ళకు సొంతరాష్ట్రం బాగు జేసుకునుడు తెల్వదా!
లాక్‌ ‌డౌన్‌ ‌తిప్పలు జేషిన ఈపు మీది దెబ్బలు మానుతయేమో గని,కడుపు మీదిదెబ్బలు పోయేటియా!మాగనే యాదికుంటయిగని! కాలం రాకపోతదా!వచ్చినప్పుడు ఊడిషి, కచరాలేకుంట సాఫ్‌ ‌సఫాయి చేషేందుకు ఎనుకాడరనుకోవాలె!.
‘‘సూడ్రా బయ్‌! ‘‘ఇ‌క్రమార్క్’’!‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా!   రాష్ట్ర సాధన ఉద్దెమంల తోడున్న బుద్దిజీవులమీద సర్కార్‌ ఎం‌దుకు కచ్చ గట్టిండ్లు గావచ్చు!?ఇగురం ఇప్పిజెప్పేదాంక ఇడువ!
నని బెదిరిచ్చేటి భేతాళుని ఎప్పటి తీర్గనే భుజం మీదేసుకొని ‘‘విను!భేతాళ్‌!ఈనగాషి నక్కల పాల్జేషినట్లయింది.కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం బంగారు తెలంగాణ యేమోగని అప్పుల కొంపయింది.మన ప్రాంతమోడే మనల దోసుకునుడనేది మామూలు జనానికి కానత్తలేదు.అది కానచ్చే బుద్దిజీవులు నిమ్మళంగుంటె తిప్పలచ్చే కత మోపయితదని సర్కార్‌ ‌గుబులు!
చరిత్ర నిండ నియంత లెప్పుడు జేషిందదే!జేస్తున్నదదే!’అని జెప్పుకుంట నడ్వబట్టిండు.. నడ్వబట్టిండు…

– ఎలమంద,  తెలంగాణ

Leave a Reply