Take a fresh look at your lifestyle.

2024 నుండి 26 వరకు లక్షాలను అధికారులు పూర్తి చేయాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 22 : శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయల సముదాయ భవన సమావేశ మందిరంలో జిల్లా

కలెక్టర్ భారతి హోలీకేరీ 2024,2025,2026 సంవత్సరములకు సంబంధించి హరితహారం భవిష్యత్ కార్యాచరణ పై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,రాబోయే 2024,2025,2026 సంవత్సరములకు
సంబంధించి హరితహారంలో జిల్లాకు నిర్దేశించే లక్ష్యమును పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రతి శాఖకు నిర్దేశించే లక్ష్యమును పెండింగ్ లేకుండా పూర్తి చేసే విధంగా పని చేయాలని సూచించారు.హరిత హారంలో భాగంగా జిల్లాకు కేటాయించే లక్ష్యం ప్రకారం మొక్కలునాటేందుకు స్థలాలు గుర్తింపు,గుంతల తవ్వకం చేపట్టాలన్నారు.జిల్లాలోహరిత హారం క్రింద మొక్కలు నాటడం తోపాటు మొక్కల సంరక్షణకు చర్యలుతీసుకోవాలని,నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా పరిశ్రమలమేనేజర్ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ
అధికారి సుశీందర్ రావు, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు.
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply