Take a fresh look at your lifestyle.

బొగ్గు నిల్వలపై వాస్తవాలు దాస్తున్న కేంద్రం

  • బొగ్గు లేక అనేక విద్యుదుత్పాదన ప్రాజెక్టులు మూతపడ్డాయి
  • ప్రణాళిక లేకుంటే మరింత సంక్షోభం : కాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్ష్మయ్య

దేశంలో బొగ్గు లేక అనేక విద్యుదుత్పాదన ప్రాజెక్టులు మూతపడ్డాయని, బీజేపీ ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలుస్తుందని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యానికి, దూరదృష్టి లేకపోవడానికి విద్యుత్‌ ‌దుస్థితి అద్దం పడుతుందని అన్నారు. కేంద్రం దగ్గర ప్రణాళిక లేని కారణంగానే బొగ్గు కొరత, కరెంటు కోతలు వొచ్చాయని అన్నారు. పాలనను పక్కనపెట్టిన బీజేపీ రాజకీయాలపై దృష్టి పెట్టిందని విమర్శించారు. విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళిక చేకుంటే రానున్న రోజుల్లో మరింత సంక్షోభం తప్పదని అన్నారు. ఇకపోతే రాష్ట్ర పరిధిలో ఉండే జలవనరుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ ఎందుకో అర్థం కావడం లేదని పొన్నాల వ్యాఖ్యానించారు. నీటిపై కేంద్రం పెత్తనం చేయడానికి చేస్తున్న ప్రయత్నంతో పాటు అలాంటి అవకాశం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పేనని అన్నారు.

ఈ వ్వయహారంతో తెలంగాణ ద్రోహిగా కేసీఆర్‌ ‌చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఆనాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడాలేని విధంగా జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులను ప్రారంభించామని గుర్తుచేసిన పొన్నాల, గత ఏడేళ్లలో సాగునీటి విషయంలో కేసీఆర్‌ ‌వెలగబెట్టింది ఏంటని ప్రశ్నించారు. లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంతో తెలంగాణకు ఏం లాభం జరుగుతుందో కేసీఆర్‌ ‌చెప్పగలరా అని ప్రశించారు. కేసీఆర్‌ ఒం‌టెద్దు పోకడలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయని, చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు చేస్తున్నారని, కృష్ణా బోర్డు పాపం కేసీఆర్‌కు ఊరికేపోదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత ఒక్క మెగావాట్‌ ‌కూడా కొత్తగా విద్యుత్‌ ఉత్పత్తి చేయలేకపోయారని పొన్నాల ఎద్దేవా చేశారు.

Leave a Reply