నెత్తురు తాగే వ్యాఘ్రం
సాధుజీవి రూపమెత్తింది
ప్రాణాల తోడేసే తోడేలు
శాంతి మంత్రం వల్లిస్తుంది
కత్తుల తెగదూసే కర్కశి
మైత్రి హస్తం అందిస్తుంది
విద్వేషం చిమ్మే కాలనాగు
కరుణ రసము స్రవిస్తుంది
తగవుకు తెగపడే ఉగ్రదేశం
సామరస్యం స్వాగతిస్తుంది
మూడు యుద్దాల తదుపరి
గుణపాఠం నేర్చుకున్నామని
పాక్ కొత్త పాట పల్లవిస్తుంది
ఇకపై శాంతియుత జీవనం
సాగిస్తామని బాస చేస్తుంది
భూతల స్వర్గం కాశ్మీరంలో
పాక్ మూకల విధ్వంసపు
నెత్తుటి గాయం మానలేదు
అఖండ భారత దేశంలో
తీవ్రవాదపు దురాగతాల
చీకటి చరిత్ర మాయలేదు
అయినా కపట కన్నీళ్లకు
పౌర సమాజం కరిగిపోదు
ఈ సన్నాయి నొక్కులకు
సచ్చీల సర్టిఫికెట్ ఇవ్వదు
ఓ ఉగ్ర రాజ్యమా ఇకనైనా
కుటిల మాటలు కట్టిపెట్టి
బూటక డ్రామా విడిచిపెట్టి
బుద్ధిజీవిగా మెదిలితేనే సరి!
కాదంటే ప్రపంచ పటంలో
దేశ చిత్రం మాయం సుమీ!!
(పాక్ ప్రధాని వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ..)
– కోడిగూటి తిరుపతి, 9573929493