Take a fresh look at your lifestyle.

థర్డ్‌వేవ్‌కు సన్నద్దతే ముఖ్యం

రోగనిరోధక శక్తి పెంచుకోవాల్సిందే
బలవర్థక ఆహారం, నియంత్రణ అవసరం
విజయవాడ,జూన్‌26 : ‌థర్డ్‌వేవ్‌ ‌హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ ‌వేయించు కోవాలని, అలాగే గతంలో పాటించిన నిబంధనలను మరింత కఠనంగా పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరి స్తున్నారు. వైరస్‌ ‌జన్యు మార్పు కారణంగా కొత్త వేరియంట్లు కనిపిస్తూ వుంటాయని,అందువల్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, పరీక్షలు చాలా ముఖ్యమన్నారు. మరో సంవత్సరం పాటు కోవిడ్‌ ‌జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌ ‌సంఖ్య పెరిగితేనే వ్యాధి సంక్రమించకుండా ఇది నియంత్రిస్తుందని అంటున్నారు. వైరస్‌ ‌వేరియంట్ల వల్ల రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారు, అనారోగ్యకర జీవనశైలి గలవారు మరణిస్తారు. అంతకంటే మెరుగైన రోగనిరోధక శక్తి గలవారికి వైరస్‌ ‌సోకినప్పటికీ కోలుకుంటారు. ఆ తర్వాత వైరస్‌తో పోరాడే శక్తి వారిలో వృద్ధి చెందుతుంది. అయినప్పటికీ, మానవుల్లోని రక్షణ వ్యవస్థను ఛేదించుకుని చొరబడేందుకుగాను…తన ప్రొటీన్‌ ‌నిర్మాణాన్ని మార్చుకోవడం ద్వారా వైరస్‌ ‌నిరంతరం రూపాంతరం చెందుతుంటుందని అన్నారు. కోవిడ్‌ ‌పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ నమోదైనప్పుడు మహమ్మారి నియంత్రణలో వున్నట్టు మనం భావించాలి.

మాస్క్ ‌ధరించడం, భౌతిక దూరం పాటించడం, సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం, గుంపులకు లేదా జన సకరణలకు దూరంగా వుండడం వంటివి నిరంతరం ఆచరించాలన్నారు. కోవిడ్‌ ‌మహమ్మారి మన లోపాలను ఎత్తిచూపింది. అనేక సంవత్సరాలుగా అవసరమైనంత మేరకు ఆరోగ్య రక్షణ గురించి శ్రద్ధ తీసుకోలేదని గుర్తు చేసిందని అన్నారు. బలమైన రోగనిరోధక శక్తి ప్రాధాన్యతను కోవిడ్‌ ‌మహమ్మారి మనకు తెలియచేసింది. కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం ద్వారా వారం లేదా రెండు వారాల్లో వ్యాధి నిరోధక శక్తిని పొందగలమని మనం అనుకుంటాం. కాని అది నిజం కాదు. కొన్ని నెలల పాటు ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించడం,వ్యాయామం చేయడం, ఊబకాయం రాకుండా చూసుకోవడం, సకృత ఆహారాన్ని తీసుకోవడం, రోజుకు కనీసం 7 లేదా 8 గంటల పాటు నిద్ర పోవడం, ఒత్తిడిని దరిచేరకుండా చూసు కోవడం, పొగాకు ఉత్పత్తులకు-మద్యానికి దూరంగా వుండడం ద్వారా మాత్రమే దృఢంగా తయారవుతామంటున్నారు. రోగనిరోదక శక్తిన ఇపెంచుకుంటే త్వరలోనో మూడవ వేవ్‌ ‌వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవచ్చన్నారు. కోవిడ్‌ ‌మొదటి రెండు దశల్లో మనం నేర్చుకున్న గుణ పాఠాలు మూడవ వేవ్‌ను ఎదుర్కోవడానికి అనుభంగా తీసుకోవాలన్నారు.

Leave a Reply