Take a fresh look at your lifestyle.

తనపై వచ్చిన వదంతులను ఖండించిన మాజీ మంత్రి: జూపల్లి

Ex-minister denies rumors against him Jupalli
నా జీవితం ఉన్నంత వరకు టిఆర్‌ఎస్‌ ‌పార్టీలోనే ఉంటా : జూపల్లి

తాను కాంగ్రెస్‌, ‌బిజెపిలో చేరుతున్నట్లు సోషల్‌ ‌మీడియా, కొన్ని న్యూస్‌ ‌చానల్స్‌లో వస్తున్న వదంతులపై జూపల్లి కృష్ణారావు ఫైర్‌ అయ్యారు. సోమవారం నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా కేంద్రంల్లో వెలుమ ఫంక్షన్‌ ‌హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై వస్తున్న తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండించారు. నా జీవితం ఉన్నంత వరకు టీఆర్‌ఎస్‌ ‌పార్టీలోనే ఉంటానని, కేసీఆర్‌ ‌నాయకత్వంలోనే పని చేస్తానని తెలిపారు. పూటకో పార్టీ మార్చే నైజం తనది కాదని తెలిపారు. నిబద్ధతతో ప్రజలకోసం జీవిస్తూ రాజకీయాలు చేస్తూన్నానని, ప్రజాలకోసమే జీవిస్తానని అన్నారు. నిఖార్సైన తెలంగాణ వాదిగా రాష్ట్ర సాధనలో భాగంగా మూడున్నర ఏళ్ల మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకుని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ అడుగులో అడుగు వేసి పొరాడానని అన్నారు.

కుటుంబంలో చిన్న చిన్న ఆటుపోట్లు సహజమేనని, మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో స్థానికంగా వచ్చిన కొన్ని విభేదాల వల్ల మాకు సంబంధించిన వారే పోటీచేశారని వారంతా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వారేనని వారందరూ తెలంగాణ వాధులేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పెద్దకొత్తపల్లి ఎంపీపీ సూర్యప్రతాప్‌ ‌గౌడ్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు దండు నరసింహ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply