Take a fresh look at your lifestyle.

ఎలక్టోరల్‌ బాండ్లు అతిపెద్ద కుంభకోణం

సుప్రీమ్‌కోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌
ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచేలా ఒత్తిడి పెంచాలి : ఎలక్టోరల్‌ బాండ్ల కేసు పిటిషనర్‌ అంజలి భరద్వాజ్‌
అసమ్మతి ప్రజాస్వామ్యానికి జీవనాధారం : టీపీజేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌
పౌర సమాజ గొంతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి : భారత్‌ జోడో అభియాన్‌ ప్రతినిధి విస్సా కిరణ్‌
భారత్‌ జోడో అభియాన్‌, తెలంగాణ పీపుల్స్‌ జేఏసీ సంయుక్త సమావేశంలో వక్తలు

నాంపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ఎలక్టోరల్‌ బాండ్ల కుంభకోణం భారత దేశంలో ఎన్నడూ లేనంత అతిపెద్ద కుంభ కోణమని సుప్రీమ్‌ కోర్టులో ఎలక్టోరల్‌ బాండ్ల కేసుకు నేతృత్వం వహించిన అడ్వకేట్‌ ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు. ఈ మేరకు ఆదివారం నాంపల్లి లోని మదీనా ఎడ్యుకేషనల్‌ సొసైటీలో భారత్‌ జోడో అభియాన్‌, తెలంగాణ పీపుల్స్‌ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో (టిపిజెఎసి) వారు భారీ ఎలక్టోరల్‌ బాండ్ల కుంభకోణం, బిజెపి ప్రభుత్వం అన్ని సంస్థలను దుర్వినియోగం చేసి స్వాధీనం చేసుకోవడం, 2024లో అదే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వొస్తే భారత దేశంలో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదం గురించి మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రశాంత్‌ భూషణ్‌ మాట్లాడు తూ..ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బీజేపీకి అందిన రూ.8400 కోట్లకు మించిన స్థాయిలో అవినీతి జరిగిందన్నారు. ఎలక్టోరల్‌ బాండ్ల క్విడ్‌ ప్రోకోలో లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు, ప్రాజెక్టులు ఇచ్చారని, ఎలక్టోరల్‌ బాండ్‌ డేటా యొక్క విశ్లేషణ అవినీతి, చట్టవిరుద్ధతను సూచించ డం చాలా ముఖ్యమని ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు. దీనికి కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నేతృత్వంలో తదుపరి దర్యాప్తు అవసరమని, ఈ అంశంపై సుప్రీమ్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నా యన్నారు. ఎన్నికల నియమావళిలోని అంతరాలను కూడా ఆయన బహిర్గతం చేశారు.
image.png
ముఖ్యంగా వ్యక్తిగత అభ్యర్థులపై 95 లక్షల ఖర్చు పరిమితి ఉన్నా కానీ పార్టీలపై ఖర్చుకు పరిమితి లేదని, కేవలం ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బిజెపి అధికారి కంగా రూ.8400 కోట్లు పొందిందని, ఇది బిజెపి పెట్టిన అభ్యర్థులందరిపై ఖర్చు చేసే పరిమితి కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువ అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ డిపార్ట్‌మెంట్‌ వంటి సంస్థలను దుర్వినియోగం చేయడం, ప్రతిపక్ష నేతలను, ముఖ్యమంత్రులను జైళ్లలో పెట్టడం వంటి చర్యలతో మన ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తున్న బీజేపీ తీరుపై ఆయన విపులంగా మాట్లాడారు. బిజెపి ఎన్నికల కమిషన్‌ను కూడా  నిర్వీర్యం చేస్తుందన్నారు. కాగ్‌ విశ్వవిద్యాలయాలలో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులను వీసీలుగా నియమించడం, బుల్‌డోజర్‌-రాజ్‌ను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రధాన స్రవంతి మీడియా చాలా వరకు రాజీ పడినప్పటికీ, ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యామ్నాయ మీడియాను కట్టడి చేయాలనుకుంటుందని అన్నారు. హైదరాబాదీ కథనం, ఎన్నికలు రెండిరటిలోనూ బీజేపీ ఓడిపోతుందని భరోసా ఇస్తూ, మన స్ఫూర్తిని ఉన్నతంగా ఉంచుకోవాల్సిన తరుణం ఇదేనని, పౌరులుగా, ప్రజా ఉద్యమాలుగా రాజ్యాంగాన్ని రక్షించడంలో మనల్ని మనం పూర్తిగా నిమగ్నం చేసుకోవాలని, దీనిని రాజకీయ పార్టీలకు మాత్రమే వదిలిపెట్టలేమని అన్నారు.
image.png
ఎలక్టోరల్‌ బాండ్ల కేసులో పిటిషనర్లలో ఒకరైన కామన్‌ కాజ్‌కి చెందిన అంజలి భరద్వాజ్‌ రాజ్యాంగం ముప్పుకు ఉన్న మూడు మార్గాలపై మాట్లాడుతూ… ఎ) ప్రశ్నించే ప్రజల హక్కుపై నిర్బంధం, బీ) ప్రజానుకూల చట్టాలను బలహీనపరచడం, సీ) ప్రజాస్వామ్య సంస్థలు తమ బాధ్యత నుండి తప్పుకుంటున్నానే అంశాలను తెలిపారు. సమాచార రక్షణ చట్టాల ద్వారా సమాచార హక్కు చట్టంపై దాడి, సమాచార కమిషనర్ల నియామక పక్రియను ప్రభావితం చేయడం గురించి ఆమె మాట్లాడారు. అనేక ఉదాహరణలను ఇస్తూ, ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసేవారి మధ్య క్విడ్‌ ప్రోకో యొక్క నమూనాను, వ్యవసాయ చట్టాలు, లేబర్‌ కోడ్‌ల వంటి కార్పొరేట్‌ అనుకూల ప్రజా వ్యతిరేక చట్టాల శ్రేణిని ఆమె హైలైట్‌ చేశారు. ప్రజల సమాచార హక్కును బలోపేతం చేసే ఎలక్టోరల్‌ బాండ్లపై ఎస్సీ ఉత్తర్వును స్వాగతిస్తూ, 2019 ఎన్నికలలో సహాయపడిన, 2024 ఎన్నికలలో ఉపయోగించబడుతున్న అతిపెద్ద లబ్ధిదారుడు బిజెపికి 6 సంవత్సరాల ఆలస్యం ఖరీదైనదని అన్నారు. ప్రశ్నించడం కొనసాగించాలని, తెలివిగా వోటు వేసే అధికారాన్ని ఉపయోగించాలని, మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచడానికి అధికారులు, సంస్థలపై ఒత్తిడి పెంచాలని ఆమె పౌరులకు పిలుపునిచ్చారు.
image.png
అసమ్మతి ప్రజాస్వామ్యానికి జీవనాధారమని ప్రముఖ మేధావి, తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(టీపీజేఏసీ) కన్వీనర్‌ ప్రొ.హరగోపాల్‌ అన్నారు. కానీ బిజెపి సాధ్యమైన అన్ని విధాలుగా అసమ్మతిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ముఖ్యమైన సమస్యలను లేవనెత్తే సాధారణ పౌరులపై క్రూరమైన చట్టాలను ప్రయోగిస్తుందన్నారు. మనం ఈరోజు ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నాము కాబట్టి మన ప్రజాస్వామ్యం కోసం నిలబడవలసిన చారిత్రక బాధ్యత ఉందన్నారు. తెలంగాణకు ఘనమైన ప్రజా ఉద్యమాల చరిత్ర ఉందని, అందుకు తగ్గట్టుగా మనం ఎదగాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వొస్తే ఎలక్టోరల్‌ బాండ్‌లను తిరిగి ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి చెబుతున్న తీరును, అపెక్స్‌ ప్రశ్నిస్తున్న ఈ పథకం రాజ్యాంగబద్ధత ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి ఎలక్టోరల్‌ బాండ్‌లను ‘సక్సెస్‌ స్టోరీ’గా పేర్కొనడం సిగ్గుచేటని కూడా ఆయన ఖండిరచారు.
భారత్‌ జోడో అభియాన్‌(టీపీజేఏసీ) నుండి కిరణ్‌ విస్సా, ఎన్నికల వెలుగులో భారత్‌ జోడో అభియాన్‌, టీపీజేఏసీ సహా తెలంగాణలో పౌర సమాజం చేపడుతున్న కార్యక్రమాల గురించి మాట్లాడి కార్యాచరణకు పిలుపునిచ్చారు. భూమి నుండి వెలువడుతున్న వాస్తవాలు, నిరుద్యోగం, రాజ్యాంగానికి ముప్పు వంటి సమస్యల ఆధారంగా స్పష్టమైన కథనాన్ని రూపొందించడంలో పౌర సమాజ గొంతులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. భారత్‌ జోడో, టీపీజేఏసీతో చేతులు కలుపుతూ రాబోయే 3 వారాల్లో అవగాహన కార్యకలాపాల్లో క్రియాశీలక పాత్రను చేపట్టాలని పౌరులకు మరియు సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బివి.శేషగిరిరావు, మీరా సంఘమిత్ర, కన్నెగంటి రవి, జాహిద్‌ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply