Take a fresh look at your lifestyle.

హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి మందులు సరఫరా చేయాలి

కరోనా పాజిటివ్‌ ‌వచ్చి వైద్యాధికారుల సూచన మేరకు భద్రాచలం పట్టణము లో హోమ్‌ ఐసోలేషన్‌ ‌లోఉన్న వారందరికీ ప్రభుత్వం మందులు సరఫరా చేయాలని ఐసోలేషన్‌ ‌కిట్‌ ‌లు పంపిణీ చేయాలని సిపిఐ రాష్ట్ర నేత రావులపల్లి రాంప్రసాద్‌ ‌కోరారు.సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆయన మాట్లాడుతూ భద్రాచలం పరిసర ప్రాంతాల్లో పాజిటివ్‌ ‌వచ్చిన వారు మందుల ప్రైవేట్‌ ‌గా కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం ఐసోలేషన్‌ ‌కిట్‌ ‌లు ఎందుకు పంపిణీ చేయటం లేదని,మందులు, సానిటేజర్‌,‌పల్స్ ఆక్సిమిటర్‌, ‌మాస్క్ ‌లు కలిపి కిట్‌ ‌లు ఇవ్వాలని అన్నారు.

ఐసోలేషన్‌ ‌కిట్‌ ‌లో ఉన్న మందులు  ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే విధంగా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మందులు ఏర్పాటు చేయాలని కోరారు. భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో ,పట్టణంలో ప్రతిరోజూ పంచాయతీ అధికారులు శానిటేషన్‌ ‌బ్లీజింగ్‌, ‌హైపో క్లోరైడ్‌ ‌ద్రావణాన్ని పిచికారీ చేయాలని కోరారు.ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మళ్ల వెంకటేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి ఆకోజు సునిల్‌,‌సురేష్‌ ‌నాయుడు, సాయి కుమార్‌, ‌గుమ్మడి రాజు తదితరులు ఉన్నారు.

Leave a Reply