Take a fresh look at your lifestyle.

నేటి నుంచి పాఠశాల విద్యార్థులకు.. ఆన్‌లైన్‌ ‌బోధన

  • రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు
  • న్యూస్‌ ‌చానళ్లు, వెబ్‌సైట్ల ద్వారా పాఠాలు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌పద్ధతిలో పాఠాలు బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి రాష్ట్రంలో ఆన్‌లైన్‌ ‌ద్వారా విద్యార్థులకు స్కూల్‌ ‌పాఠాలు బోధించనున్నారు. ఈ మేరకు  టీశాట్‌, ఆన్‌లైన్‌ ‌ద్వారా ఈ విద్యాబోధన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ‌టీ శాట్‌ ‌టీవీ స్టూడియోలో ఏర్పాట్లు చేపట్టారు. 10 తరగతిలోపు విద్యార్థులకు ఆన్‌లైన్‌ , ‌టీవీల ద్వారా పాఠాలు బోధిస్తామని వెల్లడించారు. టీశాట్‌ ‌తీశాట్‌, ‌తీశాట్‌ ‌నిపుణ రెండు చానల్స్, ‌వెబ్‌సైట్‌, ఆన్‌లైన్‌ ‌డిజిటల్‌, ‌మొబైల్‌ ‌యాప్‌ ‌ద్వారా పాఠాలు చెప్పనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి పాఠాలను సాయంత్రం వేళల్లో తిరిగి ప్రసారం చేస్తామని తెలిపారు. ఎక్కడ ఇబ్బందులు అనేవి ఉండవని, పవర్‌ ‌కట్‌ ‌ప్రాంతాల్లో మళ్ళీ పాఠ్యంశాలను తిరిగి ప్రసారం చేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్‌ ‌ప్రకారం ప్రసారాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌పద్ధతిలో పాఠాలు బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్‌ 1 ‌నుంచి ఈ తరగతులు మొదలు కానున్నాయి. ఆలోపు వీటికి సంబంధించిన ఆన్‌లైన్‌ ‌క్లాస్‌ ‌మెటీరియల్‌, ‌వీడియో పాఠాలు వంటివి తయారు చేయాల్సిందిగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఇప్పటికే ఆదేశించడంతో అందుకు అనుగుణంగా సన్నద్దం అయ్యారు.  దీని కోసం  27 నుంచి పాఠశాల సిబ్బంది విధులకు హాజరు అవుతున్నారు. విద్యా సంవత్సరం ఇబ్బందుల్లో పడకుండా ఆన్‌లైన్‌ ‌పద్ధతిలో పాఠ్యాంశ బోధనకు అనుమతి ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ప్రారంభించగా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌ ‌లేదా టీవీ/టీశాట్‌ ‌ద్వారా బోధించేందుకు విద్యాశాఖ తాజాగా ఆదేశాలి చ్చింది. రాష్ట్రంలో 28 వేలకు పైగా ప్రభుత్వ విద్యా సంస్థలున్నాయి.

వీటిలో 30 లక్షల మందికిపైగా విద్యార్థులున్నారు. ఆన్‌లైన్‌ ‌తరగతులు నిర్వహిస్తే ఎంతమందికి వెసులుబాటు ఉంటుందనే దానిపై ఇటీవల విద్యాశాఖ పరిశీలన చేసింది. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి నిర్ణీత ఫార్మాట్‌లో వివరాలు సేకరించింది. దాదాపు సగానికిపైగా విద్యార్థుల ఇళ్లలో టీవీలు, కేబుల్‌ ‌లేదా డిష్‌ ‌కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే టీశాట్‌ ‌ద్వారా పాఠాలను ఎంతమంది చూస్తారనే దానిపై ఎలాంటి అంచనాల్లేవు. మరోవైపు కనెక్షన్లు ఉన్నప్పటికీ నిర్దేశిరచిన సమయాల్లో చూసి అవగాహన చేసుకునే దానిపైనా స్పష్టత లేదు. పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌పాఠాలు పూర్తిగా కొత్త. వాస్తవానికి క్షేత్రస్థాయిలో టీచర్లకు తమ తమ పాఠశాలల్లోని పిల్లలకు వారి అవగాహన స్థాయిని బట్టి పాఠ్యాంశ బోధనను ఎలా చేపట్టాలో ఓ అంచనా ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయ పనులు కొనసాగుతుండడంతో చాలామంది పిల్లలు తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశిరచిన సమయంలో విద్యార్థులు ఇళ్లలో ఉండి వీడియో పాఠాలు చూసే అవకాశాలు తక్కువని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply