Take a fresh look at your lifestyle.

సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష

గజ్వెల్, ప్రజాతంత్ర, నవంబర్ 1: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  సంక్షేమ కార్యక్రమాలే మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చేలా చేస్తాయని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు.బుధవారం గజ్వేల్ మండలం కోడకండ్ల గ్రామంలో భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో ఇంటింటి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు  రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  తీసుకొచ్చిన తెలంగాణ సంక్షేమ పథకాలను కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం దేశము లో అమలు చేస్తున్నారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల్లో నేడు దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని  అని అన్నారు. నాటి ఉద్యమం, నేటి అభివృద్ధి లో గజ్వేల్ ముందు వరుసలో ఉందన్నారు. గజ్వేల్  నియోజకవర్గం రాష్ట్రంలోనే ఇతర నియోజకవర్గాలకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని,  అభివృద్ధితో పాటు సేవలో ఆదర్శంగా నిలిచిందని, ఇది ప్రజల భాగస్వామ్యం, ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. గజ్వేల్ అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారని ప్రతిపక్షాల తీరుపై  వారు దుయ్యబట్టారు.  కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ ప్రధాన మంత్రులు మారినా ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోయారని, తాగునీరు ఇవ్వలేకపోయారని కాంగ్రెస్, బీజేపీ ల స్వార్థ రాజకీయాలకు ప్రజలు బలి కావొద్దన్నారు. 70 ఏళ్లలో గ్రామాలలో జరగని అభివృద్ధి, నేడు పల్లెల్లో వెల్లువిరుస్తుందని బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు ఆలోచించి మంచి మెజార్టీతో  కేసీఆర్ ను గెలిఫించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, ప్యాక్స్ చైర్మన్ వెంకటేష్ గౌడ్,బీఆర్ఎస్ మండల సమన్వయ సమితి సభ్యులు పండారి రవీందర్ రావు, ఎంపీటీసీ అశోక్, రైతుబందు సమితి మండల అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణా గౌడ్, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి,వెంకట్ నర్సింహారెడ్డి, దయాకర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, బాస్కర్ రెడ్డి, చిన్న మల్లయ్య, నాయకులు రమేష్ గౌడ్, వేణు మనోహర్ రావు, బాస్కర్,  శివ కుమార్, నరేష్, ముకేష్, వెంకట్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply