Take a fresh look at your lifestyle.

సమసమాజ స్థాపనకు మానవ హక్కులు

దేశం యొ క్క గొప్పతనం ప్రజ లకు కల్పించిన హక్కు ల పై ఆధారపడి ఉంటుందని ప్రఖ్యాత రాజనీతి శాస్త్రవేత్త హెచ్‌ ‌జి లాస్కీ పేర్కొ న్నట్లు అంత రాలు లేని సమాజం ఏర్పడా లంటే అందరికీ సమాన హక్కులు అవసరం. మానవ హక్కులు ఒక సార్వత్రిక సమాజ శైలిలో ఉంటాయి. బ్రిటన్లో విలియం విల్బర్‌ ‌ఫోర్స్ ‌వంటి సంస్కర్తలు బానిసత్వ నిర్మూలనకు శ్రమించారు. 1215 లో ఇంగ్లాండ్‌ ‌రాజు జాన్‌ ఎడ్వర్డ్ ‌ప్రజలకు మొదటిసారి కొన్ని హక్కులు గుర్తించి చేసిన ప్రకటనను మాగ్న కార్తా అన్నారు. మాగ్న అనగా పెద్దది, కార్ట అనగా చార్టర్‌.

1776‌లో అమెరికా స్వాతంత్య్ర ప్రకటన సందర్భంగా బిల్‌ ఆఫ్‌ ‌రైట్స్ ‌హక్కుల తీర్మానం ఆమోదించారు. 1789లో ఫ్రెంచ్‌ ‌జాతీయ సభ ఇచ్చిన నినాదం ప్రపంచ రాజ్యంగాలన్నింటిని ప్రభావితం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఆధునిక మానవ హక్కుల సాధనకు దారితీశాయి. ఐక్యరాజ్య సమితి ఏర్పాటు తరువాత మానవ హక్కుల చట్టం ప్రధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వేవేరు నేపథ్యాలున్న ప్రతినిధులు మానవ హక్కులు రూపొందించారు. అమెరికా మాజీఅధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ ‌డి రూజ్వెల్ట్ ‌భార్య ఏలినర్‌ ‌రూజ్వెల్ట్ ‌ముసాయిదా కమిటీకి సారథ్యం వహించారు. ఐక్యరాజ్యసమితి 183 సర్వ ప్రతినిధి సభ ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబర్‌ 10‌న సార్వత్రిక మానవ హక్కులు ప్రకటించింది. ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 10 అం‌తర్జాతీయ మానవహక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

మానవులంతా ఒకటే. ప్రతివారికీ సహజసిద్ధ గౌరవం, సమాన శాశ్వత హక్కులు ఉన్నాయి. హక్కుల ప్రకటనలో 30 ప్రకరణాలు ఉన్నాయి. వివక్షతలేని జాతి, వర్గ, లింగ, కుల, మత, రాజకీయ హక్కు, వెట్టిచాకిరి బానిసత్వం నుండి రక్షణ, కారణం లేకుండా నిర్బంధించ కూడదు, స్వదేశ, విదేశాల్లో స్వేచ్ఛగా పర్యటించే హక్కు ప్రాథమిక అవసరాలుగా గుర్తించారు. స్వాతంత్య్రానంతరం అందరినీ సమానంగా చూడాలని ఆలోచనతో రాజ్యాంగ నిర్మాతలు కొన్ని హక్కులు కల్పించారు. వాటిని ప్రాథమిక హక్కులు అన్నారు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. వాటిని ఏడు రకాలుగా వర్గీకరించారు. సమానత్వపు హక్కు, వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్రం పీడన నిరోధం, మత స్వాతంత్య్రం, సాంస్కృతిక, విద్య, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహార హక్కులుగా పేర్కొన్నారు.దేశంలోమానవ హక్కుల పరిరక్షణకు జాతీయ రాష్ట్రస్థాయి మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటుకు అవకాశం కల్పించి దానికి 2006లో సవరన తెచ్చారు.

రాజ్యాంగం అందిస్తున్న ప్రాథమిక హక్కులలో మత స్వేచ్ఛ, వాక్‌ ‌స్వాతంత్య్రం, కార్యనిర్వాహక-న్యాయ వ్యవస్థలను వేరు చేయడం, ఉద్యమ స్వేచ్ఛను అందిస్తున్నాయి. రాను రాను మహిళలలు స్వేచ్ఛగా నడయాడే పరిస్థితి, సమాన అవకాశాలు మృగ్యమయ్యాయి. మహిళలపైఅత్యాచారాలు,లైంగిక వేధిం పులవలన మహిళల హక్కులకు భంగం ఏర్పడింది. దేశంలో 24 శాతం పిల్లలురోజల్ల ఆహారం లేకుండా ఉంటున్నారని సేవ్‌ ‌ది చిల్డ్రన్‌ ఇం‌టర్నేషనల్‌ ‌సర్వేలో వెల్లడైంది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలను నెరవేర్చకుండా, నిబంధనల ప్రకారం రాయితీలను ఇవ్వకపోవడం, ఇటీవలి వ్యవసాయ సాగు చట్టాలు ప్రజల హక్కులను భంగపరుస్తున్నాయి. దళితులపై అత్యాచారాలు గతం కన్నా 7.3 శాతం అధికంగా నమోదైనట్లు నేషనల్‌ ‌క్రైమ్‌ ‌రికార్డస్ ‌బ్యూరో వెల్లడించింది. మానవ హక్కుల పరిరక్షణకు హ్యూమన్‌ ‌రైట్స్ ‌కమిషన్‌ ‌సహా అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి.

అమ్నెస్టీ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ కూడా స్వచ్ఛందంగా హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నది.మానవ హక్కుల కమిషన్లుఅన్నిరాష్ట్రాలలో పూర్తిస్థాయిలో ఏర్పాటుకాలేదు. తగినంతమంది సిబ్బంది నియామక్‌ ‌జరగకవలన వేలకొద్దీ సమస్యలు పరిష్కారం నోచుకోలేదు.మానవ హక్కుల పరిరక్షణకు మహాత్మా గాంధీ, అంబేద్కర్‌, ‌నెల్సన్‌ ‌మండేలా, మార్టిన్‌ ‌లూథర్‌ ‌కింగ్‌ ‌వారు సహా బాలగోపాల్‌ ‌వరకు ఎంతోమంది జీవితాలను త్యాగం చేసారు. వారి జీవిత అనుభవసారం స్ఫూర్తి పొంది మానవ హక్కుల పరిరక్షణౌ పాటుపడాలి.

Leave a Reply