Take a fresh look at your lifestyle.

నేడు రక్షాబంధన్‌ ‌పండుగ

  • 18న వినాయక చవితి
  • పండితపరిషత్తు నిర్ణయం

హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ఈ ఏడాది రక్షా బంధన్‌ ‌పండుగ ఆగస్టు 30న లేదా 31వ తేదీ అనే విషయంలో చాలా మందికి గందరగోళంగా ఉంది. ఈ సందర్భంగా ఏ సమయంలో రాఖీ కట్టాలి..ఈ ఏడాది 30న బుధవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి ఉదయం 10:58 గంటలకు ప్రారంభమయ్యింది. మరుసటి రోజు 31న ఉదయం 7:05 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రక్షా బంధన్‌ ‌పండుగను ఆగస్టు 30వ తేదీన జరుపుకోవచ్చని ఉత్తర భారతంలోని పండితులు సూచిస్తున్నారు. అయితే ఈరోజున భద్రకాలం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే దక్షిణ భారతదేశంలో ఏ పండుగకైనా సూర్యోదయ తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి రాఖీ పండుగను గురువారం జరుపుకోవాలని తెలుగు రాష్ట్రాల పండితులు చెబుతున్నారు.

హిందూ పంచాంగం ప్రకారం..ఈ ఏడాది రక్షా బంధన్‌ ‌పండుగ ఆగస్టు 30న(బుధవారం) మొదలవుతుంది. అయితే.. ఆ రోజున భద్ర కాలం ఉంది. ఆగస్టు 30న రాత్రి 9:01 గంటలకు భద్రకాలం ముగుస్తుంది. శాస్త్రాల ప్రకారం, భద్ర కాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు.  అందువల్ల ఈ పండుగను ఆగస్ట్ 31‌న జరుపుకోవటం ఆమోదయోగ్యమైనదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం.. భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్ర కాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి.

ఈ ప్రకారం రాష్ట్రంలోని జ్యోతిష పండితులు, వేదపండితులు నిర్ణయించిన ప్రకారంగా ఈనెల 31న రాఖీ పండుగ, సెప్టెంబర్‌ 18‌న వినాయక చవితి నిర్వహించుకోవాలని బ్రాహ్మణ సేవాసమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు త్రౌండ నాగేంద్రశర్మ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విద్వత్‌సభ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని వారు సూచించారు. హనుమకొండలోని బ్రాహ్మణ భవన్‌లో పురోహిత, బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వి•డియా సమావేశంలో వారు మాట్లాడుతూ..సెప్టెంబర్‌ 18‌న మధ్యాహ్న వ్యాప్తి, చంద్రోదయ కాలమే వినాయకచవితి పూజలు నిర్వర్తించడం ధర్మ ప్రకారంగా వొస్తుందని తెలిపారు. 19న చవితి తిథి ఉన్నదని 18న వినాయక విగ్రహాలను ప్రతిష్ఠాపన చేసుకుని కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. అక్టోబర్‌ 14‌న మహాలయ, పెత్తర అమావాస్య, బతుకమ్మ పండుగ ప్రారంభం, అక్టోబర్‌ 22‌న సద్దుల బతుకమ్మ, అక్టోబర్‌ 23‌న దసరా నిర్వహించుకోవాలని వారు తెలిపారు.

Leave a Reply