Take a fresh look at your lifestyle.

దండుపాళ్యం ముఠాలా కెటిఆర్‌ ‌బృందం

  • ఐటిఐఆర్‌ ‌భూములను కాజేసే కుట్ర
  • ప్రభుత్వ భూములన్నీ హాంఫట్‌ అవుతున్నాయి
  • మీడియా సమావేశంలో ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి

మంత్రి కేటీఆర్‌ ‌తోపాటు కొందరు ఐఏఎస్‌ అధికారులు దండుపాళ్యం ముఠాలా తయారయ్యారని ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు ఐఏఎస్‌లు కేటీఆర్‌ ‌తొత్తులు.. ఆలీబాబా అరడజన్‌ ‌దొంగల్లా మారారు. తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నకొందరు ఐఏఎస్‌ అధికారులు మంత్రి కేటీఆర్‌కు తొత్తులుగా మారారని ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. సోమేశ్‌ ‌కుమార్‌, అరవింద్‌ ‌కుమార్‌, ‌జేయేష్‌ ‌రంజన్‌, ‌లోకేష్‌ ‌కుమార్‌, ‌వెంకట నర్సింహా రెడ్డి, మరో వ్యక్తి, కేటీఆర్‌ ‌ఫ్రెండ్‌ శ్రీ‌ధర్‌.. ‌వీళ్లంతా కేటీఆర్‌ ‌చెప్పినట్లు రూల్స్ ‌క్రియేట్‌ ‌చేసి.. కోట్ల విలువ చేసే భూములను ఆగం చేస్తుండ్రు.. గతంలో పరిశ్రమల కోసం సేకరించిన భూములను ఇప్పుడు.. ఇంటి స్థలాలుగా మారుతున్నాయి.. పొల్యూషన్‌ ‌పేరుతో.. పరిశ్రమలను ఐటీ పరిశ్రమలుగా మారుస్తున్నారు.. తర్వాత ఆ భూములను ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు..

అక్రమంగా భూ వినియోగమార్పిడి జరుగుతోంది.. బెంగుళూర్‌ ‌రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థలకు అమ్ముతుండ్రు.. ఆ దందా కు ఐటీఐఆర్‌ ‌బలైంది.. ఆ భూములు ఐటీఐఆర్‌ ‌కు కేటాయించకుండా.. దాన్ని రద్దు చేసేలా చూశారని ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ‌పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఐటీఐఆర్‌ ‌ను2013లోనే యూపీఏ సర్కార్‌ ‌మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఐటీఐఆర్‌ ‌కారిడార్‌ ‌ద్వారా 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించవచ్చు, అదేవిదంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చేవి, హైదరాబాద్‌ ‌మరో సిలికాన్‌ ‌వ్యాలీగా మారి ఉండేదని రేవంత్‌ ‌రెడ్డి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 13 వేల కోట్లతో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తే.. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయి. అదేవిదంగా 15 లక్షల మందికి ప్రత్యేక్షంగా , 55.9 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అయితే దీన్ని ఫాలో అప్‌ ‌చేయాల్సిన రాష్ట్ర సర్కార్‌.. ‌పట్టించుకోక పోవడంతో ఐటీఐఆర్‌ ‌కోల్పోయామన్నారు..

దాని ద్వారా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కోల్పోయామని తెలిపారు. ఇప్పటి ఎన్డీయే సర్కార్‌.. ‌దానిపై వివరాల గురించి 2017లోనే అడిగితే.. కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌పట్టించుకోలేదని విమర్శించారు. 2018 లోనే ఐటీఐఆర్‌ ‌రద్దు చేసిందని, మూడేండ్ల పాటు పడుకున్న రాష్ట్ర సర్కార్‌.. ఇప్పు‌డు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాట్లాడుతుండ్రు, టీఆరెస్‌ ఎం‌పీ కొత్తకోట ప్రభాకర్‌ ‌పార్లమెంట్లో ఐటీఐఆర్‌ ‌పై 2018, 2019 లో అడిగితే.. రద్దు చేసినం అని కేంద్రమంత్రులు సమాధానం చెప్పారని రేవంత్‌ ‌రెడ్డి గుర్తు చేశారు. ఐటీ పరిశ్రమ బలోపేతమయ్యే ఐటీఐఆర్‌.. ‌రద్దు కావడానికి కేటీఆరే కారణం, అయితే దాన్ని దాచిపెట్టి ఐటీఐఆర్‌ ‌పై అబద్దాలు చెబుతున్నారని రేవంత్‌ ‌రెడ్డి దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన వాణి దేవి.. దివంగత పీవీ నరసింహారావు గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు… రామచంద్రరావు ఎమ్మెల్సీ గా ఏవి• చేయలేకపోయారు… ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌…. ‌సైన్యం లేని నాయకుడు.. కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన నాయకుడని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply