Take a fresh look at your lifestyle.

అనాధల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఐనా నెరవేర్చాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 08 : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డి సిఎస్ దగ్గర ఉన్న అనాథలకు సంబంధించిన 40 డిమాండ్ల ఫైళ్లు అన్నింటిని మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర మంత్రి సీతక్కను శుక్రవారం ప్రజా భవన్ లో కలిసి వినతి పత్రం అందజేసినట్లు అంజలీ తెలంగాణ  అనాధ హక్కుల పరిరక్షణ సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, అనాధ హక్కుల పోరాట వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్క వెంకటయ్య తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం, కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులు అనాధలకు తల్లీ తండ్రి ఉంటామని, అనాధల సమస్యలపై 2015లో క్యాబినెట్లో పెట్టిన 40 డిమాండ్లను నెరవేర్చకుండా మోసం చేశారని అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనాథల కోసం ప్రత్యేకంగా ఒక కమీషన్ని ఏర్పాటు చేయించాలన్నారు. అనాథలకు ఒక కమిటిని ఏర్పాటు చేసి, ఐఎఎస్, ఐపిఎస్, జడ్జీ, అనాథలు కూడా కమిటి సభ్యులుగా ఉండాలన్నారు. అనాథల కోసం ప్రత్యేకంగా అనాథల సంక్షేమ శాఖని ఏర్పాటు చేయాలన్నారు. అనాథలు ఇప్పుడు 3 శాఖల పరిధిలో ఉన్నారని, శిశువు సంక్షేమశాఖ, బిసి సంక్షేమశాఖ, ఎస్సీ సంక్షేమశాఖ ఈ మూడు శాఖలు ఉన్నందున అనాథలకు ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదన్నారు. ప్రత్యేక అనాథల సంక్షేమశాఖని ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. అనాథలకు జిఓ నెం.47 ప్రకారం 3 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని, కాని కెసిఆర్ అనాథలకు 5 శాతం రిజర్వేషన్ కచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాని అది పెండింగ్లోనే ఉందని అన్నారు. కావున అనాథలకు 5 శాతం రిజర్వేషన్ అన్ని రంగాలలో, రాజకీయంగా, ఉద్యోగంలో అన్నింటిలో కల్పించాలన్నారు. అనాథలకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ సెషన్లో బడ్జెట్ని కేటాయించాలన్నారు. అసెంబ్లీలో అనాథల తరపున మట్లాడడానికి ఒక అనాథ సభ్యునికి అవకాశం కల్పించాలన్నారు. అనాథలకు కేజి నుండి పిజి వరకు ప్రత్యేకంగా రెసిడెన్సియల్ని ఏర్పాటు చేయాలన్నారు. ఫ్రీ బస్పాస్, ట్రైన్ పాస్ లు ఫ్రీగానే ఇవ్వాలన్నారు. అనాథలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎంత ఖర్చయినా సిఎంఆర్ఎఫ్ పథకం నుండి మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. రాష్ట్రం మొత్తం ప్రభుత్వం అధికారులు, అనాథలకు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చి 24 గంటలలోపే వారి సమస్యలని పరిష్కరించే విధంగా ఆదేశాలు ఉండాలన్నారు. ఈ డిమాండ్లు నెరవేర్చి రాష్ట్రంలో ఉన్న 50 వేల మంది అనాధలను ఆదుకోవాలన్నారు.

Leave a Reply