Take a fresh look at your lifestyle.

మాస్క్‌లు,శానిటైజర్ల పంపిణీ

కారేపల్లి, మే 4, (ప్రజాతంత్ర విలేకరి)  : సింగరేణి మండల పరిధిలోని గేటుకారేపల్లిలో గ్రామస్తుల సహకారంతో తయారుచేసిన 1800 మాస్క్‌లను సోమవారం వైరా ఎంఎల్‌ఏ ‌లావుడ్యా రాములునాయక్‌ ‌చేతుల మీదుగా పంపిణీ చేసారు. గేటుకారేపల్లి సర్పంచ్‌ ‌భూక్యా కల్పన ద్వారా అందజేసా రు. ఇదే కార్యక్రమంలో నామా ముత్తయ్యట్రస్ట్ ‌వారు ఎంపి నామా నాగే శ్వరరావు ద్వారా అందించిన సింగరేణి మండలంలోని 41 గ్రామపంచా యతీలకు 5లీటర్ల శానిటైజర్ల బాటిళ్లు 41లను ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ఎంఎల్‌ఏ ‌చేతుల మీదుగా  పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లో ఎంఆర్‌ఓ ‌డి పుల్లయ్య, ఎంపిడివో మాచర్ల రమాదేవి, సిఐ బి శ్రీని వాసులు, ఎస్‌ఐ ‌పొదిలి వెంకన్న, ఎంపిపి మాలోతు శకుంతల, జడ్పిటిసి వాంకుడోతు జగన్‌, ‌వైస్‌ఎం‌పిపి రావూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Leave a Reply