Take a fresh look at your lifestyle.

‘ఆమ్‌ ఆద్మీ’కే ఢిల్లీ వోటు ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనా

Aam Aadmi's Will Win Delhi Vote Exit Polls

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రజలు మరోమారు ఆమ్‌ ఆద్మీకే పట్టంకట్టబోతున్నారని ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌ఫలితాలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించిన ఈ ఎన్నికల్లో మరోమారు ఆప్‌ అధికారం చేజిక్కించుకోబుతన్నట్లు స్పష్టం అయ్యింది. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి 54 నుంచి 59 సీట్లు, బీజేపీకి 9 నుంచి 15 సీట్లు, కాంగ్రెస్‌కు 0 నుంచి 2 సీట్ల వరకు గెలుచుకుంటాయని పీపుల్స్ ‌పల్స్ ‌ప్రెడిక్షన్‌ ‌సర్వే సంస్థ అంచానా వేసింది. చాలా చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని తెలిపింది. జాతీయవాదంపై జనాకర్షణ విజయం సాధించిందని పేర్కొంది. సంక్షేమ పథకాలు ఆప్‌నకు అధికారాన్ని అందించనున్నాయని పీపుల్స్ ‌పల్స్ ‌వెల్లడించింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ‌మరోసారి విజయ దుందుబి మోగిస్తుందని టైమ్స్ ‌నౌ ప్రకటించింది. ఆమ్‌ ఆద్మీ 44, బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. న్యూస్‌ ఎక్స్ ‌నేతా ప్రకారం.. ఆప్‌ 53-57, ‌బీజేపీ 11-17, ఇతరులు0-2 స్థానాల్లో విజయం సాధించనున్నారు.

రిపబ్లిక్‌ ‌టీవీ ప్రకారం.. ఆప్‌ 48-61, ‌బీజేపీ 9-21 స్థానాల్లో గెలుపొందనున్నారు. ఇండియా టీవీ సర్వే ప్రకారం ఆప్‌ 44, ‌బీజేపీ26, స్థానాల్లో విజయం సాధించనున్నారు. జన్‌కీ బాత్‌ ‌సర్వే ప్రకారం.. ఆప్‌ 55, ‌బీజేపీ 15 స్థానాలను కైవసం చేసుకోనున్నాయి. ఇండియా న్యూస్‌ ‌నేషన్‌ ‌ప్రకారం. ఆప్‌ 55, ‌బీజేపీ 14, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందనున్నారు. అయితే ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌ఫలితాల్లో ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆప్‌కే పట్టం కట్టారు. విద్యుత్‌, ‌మంచినీటి సరఫరా, విద్యా, ఆరోగ్యం, ప్రజా రవాణా, ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం తదితర తాము చేపట్టిన స్థానిక అభివృద్ధి కార్యక్రమాల ప్రాతిపదికన ఆప్‌ ‌నేత కేజ్రివాల్‌, ఇతర నేతలు ఎన్నికల ప్రచారం చేయగా, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ లాంటి వివాదాస్పద జాతీయ అంశాల ప్రాతిపదికన అమిత్‌ ‌షా, ఇతర బీజేపీ నేతలు ప్రచారం చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్‌ ‌సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 58 శాతం పోలింగ్‌ ‌నమోదైంది. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. 70 స్థానాలకు 672 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply