Take a fresh look at your lifestyle.

వొత్తిడి తొలగే సూత్రాలివే..

నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు
చదివిన మేరకు రాయగలమన్న
నమ్మకమే పరీక్షా భయానికి విరుగుడు

తాము చదివిన విషయాలు పరీక్షలోవస్తాయో… రావో… అనే ఆలోచనే పరీక్షా భయానికి మూలకారణమని జాతీయ అధ్యక్షుడు ఎ.ఆర్‌.పి.పి. ఇండియా డా.అట్ల శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి మొదలవుతున్న సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. వెంటాడుతున్న పరీక్షల భయాన్ని తప్పించుకునేందుకు విద్యార్థులు తప్పటడుగులు వేస్తున్నారని తెలిపారు. నేను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాను, నేను చదివిన మేరకు ఏం ఇచ్చినా రాయగలను అని అనుకుంటూ పరీక్షలకు వెళితే బాగా రాయగలరన్నారు. నేను నేర్చుకున్న మేరకు పరీక్షలో ఏ ప్రశ్నలు ఇచ్చినా సమాధానాలు రాయగలను. తెలియనివి ఇచ్చినప్పుడు బాధపడనూ అని మనసుకు పలు సూచనలు ఇచ్చుకోవాలన్నారు. ఇతరులతో పోటీ పడాల్సిన పనిలేదని, మీకు మీరే పోటీ అన్నారు. ప్రశ్నపత్రం క్షుణ్ణంగా చదివి, ఏయే ప్రశ్నలకు సమాధానాలు రాయాలో నిర్ణయించుకోవాలన్నారు.

ప్రతి ప్రశ్నకు సమయం ముందుగా నిర్ణయించుకోవాలని, బాగా తెలిసిన ప్రశ్నకు ముందుగా సమాధానం రాయాలని సూచించారు. అప్పుడు మిగిలిన ప్రశ్నలకు, సమాధానం ఉత్సాహంతో రాయగలరన్నారు. చివరగా ఒక్క సారి పేపర్‌ మొత్తం సరిచూసుకోవాలన్నారు. బయటకు వచ్చిన తర్వాత రాసిన పరీక్ష గురించి ఆలోచించవద్దు. ఇంటికి వెళ్ళి తర్వాత పరీక్ష మీదే దృష్టిని కేంద్రీకరించాలని డా.అట్ల శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. అసోసియేషన్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ సైకాలజిస్ట్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణలోని పదవతరగతి విద్యార్థులకు ఉచిత  ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం పరీక్షలు ముగిసేంతవరకు  సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు డా.అట్ల శ్రీనివాస్‌ రెడ్డి రిహాబిలిటేషన్‌ సైకాలజిస్ట్‌ జాతీయ అధ్యక్షుడు ఎ.ఆర్‌.పి.పి. ఇండియా ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల కాలంలో ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువ గా ఉన్నట్లయితే వీటి నియంత్రణ ఉచిత సహాయానికై డా.అట్ల శ్రీనివాస్‌ రెడ్డి మొబైల్‌ నంబర్‌ 9703935321 యందు అందుబాటులో ఉంటారు అని ఒక ప్రకటన లో తెలిపారు.

-డా.అట్ల  శ్రీనివాస్‌ రెడ్డి,
స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ రిహాబిలిటేషన్‌, సైకాలజిస్ట్‌
ఫ్యామిలీ కౌన్సెలర్‌
సెల్‌: 9703935321

Leave a Reply