Take a fresh look at your lifestyle.

లాక్ డౌన్ ఈ నెల 31 వరకు పొడిగింపు

ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ‌పొడిగింపు


దేశంలో కొరోనా వైరస్‌ ‌నియంత్రణకు ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు ఆదివారం సాయంత్రం లాక్‌డౌన్‌ 4.0‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రెడ్‌, ‌గ్రీన్‌, ఆరెంజ్‌ ‌జోన్లలో వ్యాపార, రవాణా, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆయా రాష్ట్రాలకే ఇచ్చింది. అయితే పరస్పర అంగీకారంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడుపుకోవచ్చని సూచించింది.అలాగే హాట్‌స్పాట్లు, కంటైన్మెంట్‌ ‌జోన్లలో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. మతపరమైన సభలు, సమావేశాల నిర్వహణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేసింది. అలాగే కంటైన్మెంట్‌ ‌జోన్ల ప్రకటనపై నిర్ణయాధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొంది.
విమాన, మెట్రో, విద్యాసంస్థలు, షాపింగ్‌ ‌మాల్స్, ‌జిమ్‌లు బంద్‌.  ‌రాత్రి 7 గంటలనుంచి ఉదయం 7 గంటల వరకు కర్య్ఫూ యదావిధిగా  కొనసాగింపు. అలాగే ప్రేక్షకులు లేకుండా స్టేడియంలో క్రీడలు నిర్వహించుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాలలో స్పష్టం చేసింది.పాఠశాలలు, కోచింగ్‌ ‌సెంటర్‌లు మే 31 వరకూ మూసివేసే ఉంటాయని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు మే 31 వరకూ తెరిచేందుకు అనుమతి లేదని కేంద్రం తేల్చి చెప్పింది. సినిమా హాళ్లు,  రెస్టారెంట్లకు హోం డెలివరీ అందించేందుకు మాత్రమే వెసులుబాటును కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Leave a Reply