Take a fresh look at your lifestyle.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసింది : రాష్ట్ర హోం మినిస్టర్ మహమూద్ అలీ

ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసిందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ముస్లిం మైనార్టీలను గౌరవించి అత్యధిక సంక్షేమ పథకాలు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమనీ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లిం కుటుంబ సభ్యులు ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి ని బలపరిచి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మాత్యులు మహమూద్ అలీ ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి, ఉప్పల్ ఎన్నికల ఇన్చార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి హాజరైనారు. ఉప్పల్ ముస్లిం మైనార్టీ చైర్మన్ బదురుద్దీన్ అధ్యక్షతన మల్లాపూర్ డివిజన్ స్వాగత్ కన్వెన్షన్ లో జరిగినది. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీ కి పెద్దపీట వేసిందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ముస్లిం మైనార్టీ ని గౌరవించి అత్యధిక సంక్షేమ పథకాలు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని ఆయన తెలియజేశారు. 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో ముస్లిం మైనార్టీలు చాలా సంతోషంగా ఉన్నారని మరి ముఖ్యంగా షాదీ ముబారక్, లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అలాగే బస్తి దవాఖానాలు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, సౌభాగ్య లక్ష్మి స్కీం ద్వారా మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయల భృతిని ప్రకటించడం జరిగింది. ముస్లిం కుటుంబ సభ్యులు ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి ని బలపరిచి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మహమూద్ ఆలీ కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి , మసీఉల్ల ఖాన్ వాక్ బోర్డ్ చైర్మన్ పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ రషీద్ ( అషూ), షకీల్ రఫీక్ నసీర్ ఇమ్రోజ్ అమీర్ , ముస్లిం మైనార్టీ సోదరులు, ఉద్యమకారులు సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply