Take a fresh look at your lifestyle.

అ‌ప్రమత్తం ..!

గద్ధలు …రాబందులు …
ఒకే చెట్టుకు చేరుకుంటయ్‌
ఒకే గూటిని పంచుకుంటయ్‌

‌జెండాలు, ఎజెండాలు విడిచి
ఒకే ‘‘దిశ’’గా విహరిస్తాయ్‌
ఒకే ‘‘నినాదం’’నోటికెత్తుకుంటయ్‌

ఇవి ఆశా మాషీ కాదు సుమీ..
రంకు నేర్చిన ‘‘రాజకీయ’’ పక్షులు
రంగులు మార్చే ‘‘పదవీ’’ కాంక్షులు

నమ్మక ద్రోహం వీటి ‘‘నైజం’’
దోచుకు తినడమే వీటి ‘‘ఇజం’’
పెద్దరికపు ‘‘పీఠం’’ కోసం …
కొంగలా కొత్త జపం చేస్తాయ్‌
‌కోయిలలా ‘‘ప్రగతి’’ రాగం అలపిస్తాయ్‌
‌పావురంలా ‘‘శాంతి’’మంత్రం జపిస్తాయ్‌
‌చిలుకలా ‘‘సంక్షేమ’’ మాటలు వల్లిస్తాయ్‌

అవసరం కోసం…
నోట ‘‘విషం’’ చిమ్ముతాయ్‌
‌రెక్కల కత్తులు జులిపిస్టాయ్‌
‌ముక్కుతో కుళ్ళబొడుస్తాయ్‌
‌నయానో, భయానో…ఏదోలా
జాతి ‘‘సంపద’’ కొల్లగొడతయ్‌

ఈ ‌బహురూపుల పక్షుల
నమ్మి  నెత్తికెత్తుకుంటివా…!
కట్టు బానిసను చేసి
ఐదేళ్లు రక్తం పీల్చి పిప్పిచేస్థయ్‌
అం‌దుకే…
నోట నాలుకలేని
అమాయక జీవులారా…!
కాస్తంత ‘‘అప్రమత్తం’’ సుమీ…!
(త్వరలో జరుగబోవు పలు ఎన్నికల నేపథ్యంలో..)
 – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply