Take a fresh look at your lifestyle.

గుడివాడ నియోజకవర్గంలో రెండేళ్ళలో రూ. 337.66 కోట్ల అభివృద్ధి

  • 1.27 లక్షల లబ్దిదారులకు రూ.149 కోట్ల సంక్షేమం
  • రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, జూన్‌ 7 : ‌గుడివాడ నియోజక వర్గంలో గత రెండేళ్ళ కాలంలో రూ.337. 66 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, సంక్షోభంలో సంక్షేమానికి కూడా అత్యధిక ప్రాధాన్య మిచ్చామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడి వాడలో మంత్రి కొడాలి నాని డియాతో మాట్లాడారు. నియోజక వర్గంలో డ్రైన్ల నిర్మాణానికి రూ.23.39 కోట్ల నిధులు, జలజీవన్‌ ‌మిషన్‌ ‌నిధులు రూ. 110.57 కోట్లు, నియోజకవర్గానికి రూ. 82 లక్షల ప్రత్యేక నిధులు, పంచాయతీరాజ్‌ ‌రోడ్ల నిర్మాణానికి రూ. 46.36 కోట్లు, నాడు – నేడులో భాగంగా స్కూల్స్ అభివృద్ధికి రూ. 11.67 కోట్లు, ఆర్‌ అం‌డ్‌ ‌బీ నిధులు రూ.47,02 కోట్లు, మెడికల్‌ ‌సబ్‌ ‌సెంటర్ల నిర్మాణానికి రూ. 4 కోట్లు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణానికి రూ. 8. 27 కోట్లు, గ్రామ సచివాలయాల నిర్మాణానికి రూ. 15.20 కోట్లు, పీఎంజేఎస్‌ ‌రోడ్ల నిర్మాణానికి రూ. 11.06 కోట్లు, గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.40 లక్షల నిధులు మంజూర య్యాయని తెలిపారు. అలాగే దీర్ఘకాలంగా ఎన్నికల హాకే పరిమితమవుతూ వస్తున్న గుడివాడ ఆర్టీసీ బస్టాండ్‌ ‌నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించామని తెలిపారు.

సీఎం జగన్మోహనరెడ్డిని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరగా రూ.32.50 కోట్ల ప్రభుత్వ నిధులను మంజూరు చేశారని తెలిపారు. అంతేగాక గుడివాడ – కంకిపాడు ప్రధాన రహదారి అద్వానంగా తయారైందని, ఈ రోడ్డు నిర్మాణానికి రూ. 16.10 కోట్లను మంజూరు చేయించానని చెప్పారు. గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఎన్టీఆర్‌ ‌హయాంలో నిర్మించిన పురాతన భవనం శిథిలమైందని, దీని స్థానంలో కొత్త భవనం నిర్మించేందుకు రూ.10.30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. వీటిలో కొన్ని పనులు పూర్తికాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు.

ఇదిలా ఉండగా గుడివాడ నియోజకవర్గంలో 38 వేల 010 మంది లబ్దిదారులకు రూ. 128.76 కోట్ల వైఎస్సార్‌ ఆసరా, 12 వేల 521 మంది లబ్దిదారులకు రూ. 8.22 కోట్ల రైతుభరోసా, 72 వేల 600 మంది లబ్దిదారులకు రూ.7.30 కోట్ల కరోనా అలవెన్స్, 1,599 ‌మంది లబ్దిదారులకు రూ.1.59 కోట్ల వాహనమిత్ర ఆర్ధికసాయం, 1,543 మంది లబ్దిదారులకు రూ .2.31 కోట్ల కాపునేస్తం, 669 మంది లబ్దిదారులకు రూ.48 లక్షల టైలర్స్ ‌నేస్తం, 181 మంది లబ్దిదారులకు రూ.24 లక్షల నాయీబ్రాహ్మణ నేస్తం, 141 మంది లబ్దిదారులకు రూ.18 లక్షల రజక నేస్తం, 75 మంది లబ్దిదారులకు రూ.20 లక్షల నేతన్న నేస్తం అందజేశామని చెప్పారు. గుడివాడ నియోజకవర్గంలో 26 వేల 983 మంది లబ్దిదారులకు ప్రతి నెలా 1 వ తేదీన వైఎస్సార్‌ ‌పెన్షన్లను అందజేస్తున్నట్టు మంత్రి కొడాలి నాని చెప్పారు.

Leave a Reply