భారత రాజ్యాంగం కల్పించిన హక్కులపై చాల మందికి అవగాహనా లేదని త్వరలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తామని అఖిల భారత మానవ హక్కుల సంఘము వరంగల్ చీఫ్ బుంగ జ్యోతి రమణ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టడానికి ప్రభుత్వాలు కృషి చేయాలనీ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారిన చట్టాల్లో మార్పులు రావడంలేదని అందువల్లే శిక్షలు ఆలస్యం కావడం వల్లే మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని జ్యోతి స్పష్టం చేశారు.
రాజ్యాంగంలో హక్కులను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, హక్కులపై అవగహన లేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని జ్యోతి తెలిపారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన మాజీ చీఫ్ జస్టిస్ చంద్రయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయ్య సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని జ్యోతి తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ యన్ పి పార్టీ తరపున పోటీచేస్తామని జ్యోతి స్పష్టం చేసారు. విలేకరుల సమావేశంలో కేడల ప్రసాద్, జ్యోతి, జలీల్, కుమారస్వామి, సుమన్, పుష్ప, రాజు, మహేష్‌కుమార్, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.
Tags: human rights, warangal chief bugga jyothi, raju mahesh kumar, yakub