Take a fresh look at your lifestyle.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణానికి సర్వంసిద్దం

నిత్యకల్యాణం మండపంలో నిర్వాహణ

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం రేపు అనగా 21 వతేదీ బుధవారం జరుగనుంది. 22 వతేదీన మహాపట్టాభిషేకం జరగనుంది. కొరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఈ ఏడాది కూడా శ్రీస్వామివారి కల్యాణం అంతరంగికంగానే జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్నిఏర్పాట్లు చేసారు. ఆలయం అంతా రంగురంగు విద్యుత్‌ ‌దీపాలతో అలంకరించారు. కేవలం అర్చకులు, వేదపండితులు, ఆలయ ఉద్యోగులతోనే నిర్వహించనున్నారు. శ్రీ ప్లవనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి అభిజిత్‌ ‌లగ్నమందు  కల్యాణం జరుగుతుంది. శివధనస్సును విరిచిన శ్రీ రామచంద్రమూర్తికి మిధిలానగరంలో జనకుని పుత్రిక అయిన సీతామహాలక్ష్మీకి ఆనాడు పెండ్లి జరిగితే భద్రాచలంలో ఉన్న చతుర్భుజాలు, శంఖుచక్రాలు ధరించిన శ్రీ మహావిష్ణువు అంశం గల వైకుంఠ రాముడు వరుడుగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ స్వరూపురాలు అయిన సీతమ్మ వధువుగా కల్యాణం జరగడం విశేషం. భార్యాభర్తల అనుబంధానికి, అనురాగానికి నిర్వచనం ఇచ్చిన ప్రేమమూర్తులు శ్రీ సీతారాములు తెలుగువారి ఇలవేల్పు భదాద్రి రాముడు. అందుకే తెలుగు వాగ్గేయకారుడైన భక్తరామదాసు, త్యాగరాజులకు ఆయన ఆరాధ్యదైవం అయ్యాడు. ఆరాధనకు అనుగుణంగా కీర్తనలు గానం చేయడం, కీర్తనలకు అనుగుణంగా ఆరాధన చేయడం భద్రాచలం క్షేత్రంలోని ప్రత్యేకత. భదాద్రిలో శ్రీ సీతారామనవమి నాడు జరిగే కల్యాణాన్ని అనుసరించి తమ తమ గ్రామాలు, పట్టణాల్లో, ఇండ్లల్లో కల్యాణాలు జరుపుకోవడం తెలుగువారి ఆనవాయితీ. తొలుత భదాద్రి రామునికి దేవాలయంలో ధృవమూర్తులకు కల్యాణం జరుగుతుంది. ఈఏడాది కూడా కొరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంవలన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆలయంలోనే నిత్యకల్యాణం మండపంలో శ్రీ స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.
సీతమ్మకు చేయిస్తి…

Leave a Reply