Take a fresh look at your lifestyle.

మే 3 నాటికి నగరంలో ఒక్క కొరోనా పాజిటివ్‌ ‌కేసు ఉండకూడదు

  • వైరస్‌ ‌విస్తరణ ఇంకా మూడో దశకు రాలేదు
  • కరోనా పరిస్థితులపై సిఎం కెసిఆర్‌ ‌సక్ష
  • తాజా వివరాలను అడిగి తెలుసుకున్న సిఎం

కోవిడ్‌-19‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో కొరోనా కేసులు పెరగడంపై దృష్టి సారించిన ఆయన.. కరోనా కట్టడిపై అధికారులకు కీలక సూచనలు చేసారు. ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహి ంచారు. ఈసమా• •శానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు ఇతర వైద్యశాఖ అధికారులు హాజర య్యారు. జీహెచ్‌ఎం‌సీ పరిధితో పాటు ఇతర ప్రాం తాల్లో కేసులు అవుతున్న నే• •థ్యంలో సీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. మే 3నాటికి నగరంలో ఒక్క కేసు కూడా ఉండకూడదని అధికారులను ఆదేశించారని తెలుస్తోంది. ఈ భేటీలో ఓల్డ్ ‌సిటీపై ప్రత్యేక చర్చకు రాగా.. పరీక్షలు ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారని ప్రగతిభవన్‌ ‌వర్గాలు తెలిపాయి.

ఇదిలావుంటే ఏరోజుకారోజు పరిస్థితిని సక్షిస్తున్నామని అన్నారు. విస్తరణ ఇంకా మూడో దశలకు రాలేదన్నారు. క్వారంటైన్‌లో ఉన్న ప్రాంతాల్లో కఠిన ఇనబందనలు అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ ‌ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ‌నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ ఉన్నతాధికారులకు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నగరంలో గుర్తించిన ప్రాంతాల్లో 100 శాతం లాక్‌డౌన్‌ ‌నిబంధనలు అమలయ్యేలా చూడాలని చెప్పారు. కేవలం ఒక్క మార్గం మాత్రమే తెరిచి ఉంచి పోలీసు పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. రానున్న 10 రోజులు కీలకమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అనుమానితుల నుంచి శాంపిళ్లు సేకరించిన 24 గంటల్లో రిపోర్టు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!