Take a fresh look at your lifestyle.

శ్రీ‌వారిపై సిఎం జగన్‌కు అపారభక్తి

మంత్రి కొడాలి నాని వాఖ్యలు ఆయన వ్యక్తిగతం
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెల్లడి

తిరుమల,సెప్టెంబర్‌ 22 : శ్రీ‌వారిపై అపారమైన భక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి సీయం జగన్‌ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. మంత్రి కొడాలి నాని వాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు.  డిక్లరేషన్‌ అం‌శం ఇప్పుడు అనవసరమని.. గతంలో వైయస్‌ ‌రాజశేఖర రెడ్డి, జగన్‌ అనేక సార్లు శ్రీవారి దర్శనం కోసం విచ్చేశారని చెప్పుకొచ్చారు. శ్రీవారి భక్తుడు కాబట్టే జగన్‌ ‌కాలినడకన తిరుమల విచ్చేశారన్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల డియాతో మాట్లాడుతూ జగన్‌కు ప్రజలపై విశ్వాసం ఉందని…ప్రజలే దేవుళ్ళుగా భావిస్తారని అన్నారు. ఆయనకు కులం, మతం పట్టింపులు లేవని చెప్పారు. దేశంలో ఎవ్వరూ చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో ప్రతిపక్షాలు కుట్ర చేస్తూన్నాయని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు.

జగన్‌ ‌పర్యటనకు ఏర్పాట్లు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ‌మార్కండేయులు ఆదేశించారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వ్రస్తాలను సమర్పించేందుకు సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23, 24 తేదీల్లో తిరుమల పర్యటనకు రానునున్నట్లు తెలిపారు. 23న మధ్యాహ్నం 3.05 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ ‌నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.50 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి బేడి ఆంజనేయస్వా మి ఆలయానికి చేరుకుని, శ్రీవారికి పట్టువ్రస్తాలను సమర్పిస్తారన్నారు. ఉత్సవాల్లో పాల్గొని, తర్వాత అతిథి గృహంలో బస చేస్తారని, 24న ఉదయం 6.25 గంటలకు మరోమారు వెంకన్నను దర్శించుకుని, తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు. అలాగే బెంగళూరు నుంచి కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఈనెల 23న సాయంత్రం తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో వెళతారన్నారు. వారి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు ఐజీ శశిధర్‌రెడ్డి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్డు మార్గంలో శానిటేషన్‌ ‌చర్యలు, ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం కోసం వచ్చే ప్రతినిధుల కోసం ప్రత్యేక బారికేడ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. తరువాత ముఖ్యమంత్రి ప్రయాణించనున్న రోడ్డు మార్గంలో ట్రయల్‌రన్‌ ‌నిర్వహించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply