Take a fresh look at your lifestyle.

భదాద్రిలో స్వామివారి బ్రహ్మోత్సవాలు

కన్నుల పండుగగా ధ్వజారోహణం

శ్రీ ప్లవనామ సంవత్సర శ్రీరామానవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా భద్రాచలం శ్రీసీతా రామచంద్రస్వామి ఆధ్వర్యంలో అంతరంగింకంగానే జరుగుతున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకే ఈ ఏడాది కూడా శ్రీస్వామివారి కల్యాణం ఉత్సవాలు భక్తులకు అనుమతి లేకుండానే అంతరంగికంగానే జరగుతున్నాయి.13వ తేది నుండి ప్రారంభమైన బ్రహ్మో త్సవాలు  27వతేదీ వరకు జరగనున్నాయి. 19వతేదీ సోమవారం నాడు ఉదయం ధ్వజారోహణం, రాత్రి భేర్యార్చనమ్‌, ఉదయం నిత్యవిధి అనంతరం యాగశాలలో అగ్ని ప్రతిష్ట జరిగింది.  తదుపరి  ధ్వజస్థంభం వద్ద కార్యక్రమము జరిగింది. ఈ ధ్వజారోహణ అనేది  ఈ మహోత్సవంలో అత్యంత  ప్రాముఖ్యత కలిగినది.  గరుడ భగవానుని  న్యాస ధ్యానాలతో అర్చించి స్తంభధ్యానము, గరుడ మంగళాష్కపఠణ, గరుడ దండకం, చూర్ణిక పఠన పూర్వరకంగా వేద స్వరూపుడైన గరుడమూర్తిని ఆరాధించి మద్గాన్నము నివేధించి  గరుడ మంత్రములతో ధ్వజారోహణము  సకల వాయిద్యములు మ్రోగుతుండగా వేదానాథంతో వైభోవోపేతంగా జరుపబడింది.  ఈ సందర్బంగా సంతానార్థులైన స్త్రీలకు గరుడ ప్రసాదము  ఇవ్వడం జరిగింది.  గరుడ మూర్తిని ప్రార్థించి పుష్పాంజలి సమర్పిస్తారు. ప్రార్ధించి భగవానుని  పాద పద్మములకు పుష్పాంజలి సమర్పించారు. తదుపరి యాగశాలలో  వివిధ హోమములు జరుపబడ్డాయి.. సాయంకాలం 6గంటల నుండి మండపంలో  భేరి మొదలగు వాయిద్యములు అర్చనాపూర్వకంగా  సకల దేవతాహ్వానం ఆలయమునకు 8 దిక్కుల యందుబలి ప్రధానం జరిగింది.

Leave a Reply