Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో సహాయక చర్యలు ముమ్మరం

  • ఇంకా నీటిలో, అంధకారంలో పలు కాలనీలు
  • విద్యుత్‌ ‌సరఫరాకు అంతరాయం.. పునరుద్ధరణకు తీవ్ర ఇబ్బందులు

భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. తాజాగా ఇప్పుడు విద్యుత్‌ ‌పునరుద్దరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలాగే జిహెచ్‌ఎం‌సి, మిలిటరీ సహాయకులు ప్రజలను రక్షించే పనిలో పడ్డారు. అలాగే నాలాల పూడికతీత పనులు కొనసాగిస్తున్నారు. కాలనీల్లో నీరు పోయేలా చేస్తున్నారు.  హైదరాబాద్‌లో నీట మునిగిన కాలనీల్లో ఇంకా విద్యుత్‌ ‌పురుద్ధరణకు నోచుకోలేదు. అవి నీటినుంచి బయటపడితే తప్ప పునరుద్దరణ సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. కుండపోతగా కురిసిన  వర్షానికి హైదరాబాద్‌ ‌మహానగరంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. పలుప్రాంతాల్లో  నగరం అంధకారంలో మునిగిపోయింది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో 800 ఫీడర్లు ఉండగా దాదాపు 400 ఫీడర్లలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు.

సోమవారం  సాయంత్రం గల్లంతయిన  కందుకూరు ,బాచుపల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర మృతదేహాన్ని వరదల్లోంచి గురువారం  బయటికి తీస్తున్న అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సురేందర్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పదుల సంఖ్యలో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.  హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్తు లైన్లపై పడ్డాయి. గాలులు లేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. ప్రతిచోటా గంటల కొద్దీ సరఫరా నిలిచిపోయింది. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తుండడం, వర్షం తగ్గకపోవడంతో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌తగ్గడంతో దీంతో గ్రిడ్‌ ‌కుప్పకూలకుండా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను బ్యాక్‌డౌన్‌ ‌చేసి, సరఫరాను మెరుగుపరిచారు.

సోమవారం  సాయంత్రం గల్లంతయిన  కందుకూరు ,బాచుపల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర మృతదేహాన్ని వరదల్లోంచి గురువారం  బయటికి తీస్తున్న అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సురేందర్ 

Leave a Reply